భర్తను హత్య చేయించిన భార్య

newly married couple attack vizianagaram
Highlights

ఈ దాడి కేసులో మరో ట్విస్ట్‌ బయటకు వచ్చింది

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం చిట్టపులివలస గ్రామానికి చెందిన యామక శంకరరావు ఇంజినీరింగ్‌ పూర్తిచేసి కర్ణాటకలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. ఏప్రిల్‌ 28న ఇదే మండలం కడకెల్ల గ్రామానికి చెందిన సరస్వతితో వివాహమైంది. వీరిద్దరూ సోమవారం తమ ద్విచక్రవాహనాన్ని సర్వీసింగ్‌కు ఇచ్చేందుకు పార్వతీపురం వచ్చారు. సర్వీసింగ్‌ పూర్తి చేసుకుని రాత్రి 7.30 గంటలకు బయలుదేరి వెళ్తుండగా గరుగుబిల్లి మండలం తోటపల్లి రిజర్వాయర్‌ సమీపంలోని ఐటీడీఏ పార్కు వద్ద లఘుశంక తీర్చుకునేందుకు ఆగారు. ఇంతలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వారిపై దాడి చేశారు. గౌరీ శంకర్రావును రాడ్డుతో తలపై మోదడంతో అతనికి తీవ్రగాయాలై మృతి చెందగా భార్య సరస్వతి గాయాలపాలైంది.

కానీ ఈ దాడి కేసులో మరో ట్విస్ట్‌ బయటకు వచ్చింది. అయితే ప్లాన్‌ ప్రకారమే భర్త శంకర్‌ రావుపై భార్య దాడి చేయించిన ఉదంతం బయటపడింది. ఇష్టంలేని పెళ్లి కారణంగానే ఈ ఘాతుకానికి పాల్పడిందని తెలుస్తోంది. సరస్వతి తన మిత్రుడు శివ, విశాఖ రౌడీషీటర్‌ గోపితో భర్తను హత్య చేయించినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్సీ పాలరాజుకు మనాపురం హైవేపై నిందితులు పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు భార్యనే పథకం ప్రకారం భర్తను హత్యచేయించిందని నిర్థారించారు.

 

loader