గుండె ఎంత పదిలమో ... ఈ యాప్ చెబుతుంది..!

New smartphone app can check your heart health
Highlights

  • గుండె పనితీరుని ఆల్ట్రా సౌండ్ స్కాన్ తో పరిశీలిస్తారు
  • ఇందుకు 45 నిమిషాలు పడుతుంది.
  • రెండు నిమిషాల్లో యాప్ తో గుండె పనితీరు తెలుసుకోవచ్చు.

మీ గుండె ఎలా కొట్టుకుంటోంది.. ఆరోగ్యంగానే ఉందా లేదా.. ఎదైనా సమస్య ఉందా.. ఇవన్నీ తెలియాలంటే.. కచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్లాలి.  వాళ్లు.. అల్ట్రా సౌండ్ స్కానర్ తో చెస్ చేసి  తర్వాత రిపోర్టు చూసి చెబుతారు. ఈ ప్రాసెస్ అంతా పూర్తి కావడానికి కనీసం 45 నిమిషాలు పడుతుంది. కానీ.. డాక్టర్ అవసరం లేకుండానే.. అది కూడా  కేవలం ఒక నిమిషం, రెండునిమిషాలలో మన గుండె ఎంత ఆరోగ్యంగా ఉందో తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు. అది కూడా స్మార్ట్ ఫోన్ని చేతిలో పట్టుకుంటే చాలు.

అమెరికాలోని కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్శిటీ కి చెందిన పలువురు దీనిపై పలు పరిశోధనలు చేశారు. అంతేకాకుండా ఒక టెక్నాలజీని రూపొందించారు. దాని సహాయంతో.. గుండె సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ టెక్నాలజీ ద్వారా గుండె.. ఎల్వీఈ ఎఫ్( లెఫ్ట్ వెంట్రిక్యులర్ ఎజక్షన్ ప్రాక్షన్)ని పనితీరు తెలుస్తుంది. ఎల్పీఈఎఫ్ అనేది గుండె కొట్టుకున్న ప్రతిసారీ ఎంత రక్తాన్ని పంపిణీ చేస్తుందనేది తెలుస్తుంది.

గుండె సరిగా పనిచేస్తే.. ఎల్వీఈఎఫ్ అనేది 50 నుంచి 70శాతం వరకు ఉంటుంది. ఒకే వేళ గుండె వీక్ గా ఉంటే దాని ఎల్వీఈఎఫ్ అనేది ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉంటుంది. ఈవిధానాన్ని నిపుణులు మొదట ఐఫోన్ లో పొందుపరిచారు. అలా ఉంచిన ఫోన్ ని ఒక వ్యక్తి చేతిలో పట్టుకొని రెండు నిమిషాల పాటు పట్టుకున్నాడు. అప్పుడు గుండె ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నరు. అనంతరం వెంటనే వైద్యుల సమక్షంలో ఎంఆర్ఐ స్కాన్ చేశారు. రెండింటి రిజల్ట్ ఒకే విధంగా వచ్చింది. దీనిని యాప్ రూపంలో పొందు పరిచి 20 ఏళ్ల నుంచి 90 ఏళ్ల వయసులోపు వారిని దాదాపు 72 మంది మీద పరిక్షించారు.

 

 

loader