త్వరలో తీసుకరానున్నట్లు ప్రకటించిన ఆర్బీఐ

నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ నుంచి అనేక షాకింగ్ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా రూ. 10 నోటు తీసుకొస్తున్నట్లు ఆర్ బీఐ అధికారికంగా ప్రకటించింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పాత నోట్ల లా కాకుండా మరిన్ని సెక్యూరిటీ ఫీచర్లతో ఈ కొత్త నోట్లు వస్తాయని తెలిపింది. ప్రస్తుతం వాడుకలో ఉన్న 2005 సిరీస్‌ నోట్ల నంబర్‌ ప్యానల్‌లలో ఇంగ్లీష్ లెటర్ ‘ఎల్‌’ను యాడ్ చేస్తూనే కొత్త నోట్లు విడుదల చేయున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.

అయితే కొత్త నోట్లు విడుదల తర్వాత పాత నోట్లు రద్దు చేస్తారా అనే భయం వద్దని పాత నోట్లు కూడా చెల్లుతాయని ఆర్ బీఐ స్పష్టం చేసింది. కాకపోతే కొత్త నోట్లు పాత నోట్లకు భిన్నంగా ఉంటాయని తెలిపింది.

కొత్త నోట్లపై రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ సంతకంతో పాటు నోటు వెనుక 2017 అని ఉంటుందట.