ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిపేరు ఖరారు రేపు నామినేషన్ వేయనున్న వెంకయ్యనాయుడు 

ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేరు ఖరారయింది.

రేపు ఉదయం 11 గంటలకు ఆయన నామినేషన్ వేస్తారని తెలిసింది.

 ఈ మేరకు ఒక ప్రకటన వెలువడ నుంది. ఇపుడు జరుగుతున్న పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నిర్ణయం అయిపోయింది. కాకపోతే, ఆయన ఉపరాష్ట్రపతి అయితే, రాజ్యసభ ఛెయిర్మన్ అయితే, ఎంత బాగుంటుందో లని అంతా పొగుడుతున్నారని విశ్వసనీయంగా తెలిసింది. అయితే, బిజెపి పార్లమెంటరీ బోర్డు నిర్ణయాన్ని పార్టీ అధ్యక్షుడు రాత్రి 7.30 గంటలకు జరిగే విలేకరులతో సమావేశంలో ప్రకటిస్తారు.

వెంకయ్యనాయుడు యుపిఎ అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ తో తలపడతారు.

ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ పేరు గతంలోనే ఖరారుచేసిన సంగతి తెలిసిందే.