2050కి కాలిఫోర్నియాతో పోటీ పడే అమరావతి రూపుదాల్చడం తథ్యం రాజధాని ముహూర్త బలం బాగుంది తెలుగు వారు ఒక్కొక్కరు ఒక బహుబలిగా తయారవ్వాలి నిజాం చార్మినార్ కట్టిస్తే ఎన్టీఆర్ బుద్దుడి విగ్రహం పెట్టించారు
ఇంతమంది తెలుగు వారిని చూస్తుంటే అమరావతిలో ఉన్నానో, అమెరికాలో ఉన్నానో తెలియడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాన్ హోజేలో తెలుగు వారినుద్దేశించి మాట్లాడుతూ అన్నారు.
పెట్టుబడులో కోసం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఈ రోజు ఇక్కడి తెలుగువారినద్దేశించి మాట్లాడుతూ ప్రపంచాన్నే జయించవచ్చని తెలుగువాళ్లునిరూపించారని అన్నారు.
ఇక్కడి తెలుగువారందరూ మీ మీ రంగాల్లో బాహుబలి గా మారాలని ఆయన పిలుపునిచ్చారు.ఆయన ప్రసంగం లోచెప్పి ముఖ్యమయిన విషయాలివి:
ప్రఖ్యాత కోహినూర్ వజ్రం తెలుగు గడ్డ నుంచే వచ్చిందన్న విషయం మనందరికీ తెలుసు. అది మనదేశం దాటి పోయినా ఒక్కొక్కరూ ఒక్కో కోహినూర్ వజ్రంగా తీర్చిదిద్దే సత్తా మనకుంది. బిల్ గేట్స్ ను ఒప్పించి సమావేశమై మైక్రోసాఫ్ట్ హైద్రాబాద్ వచ్చేలా కృషి చేశా.అందరికి ఇక్కడ ఐటీ ఉద్యోగాలు వచ్చాయి. దాంతో మీరు సరిపెట్టుకోలేదు. 75 శాతం మంది ఆన్టర్ ప్రెన్యూర్లుగా ఎదిగారు.
మన తెలుగు బిడ్డ రాజమౌళి ప్రాంతీయ భాషలో బాహుబలి తీసి మన తెలుగువాడి సత్తా చాటాడు.బాహుబలి సినిమా చూడకపోతే ఎదో కోల్పోతున్నామనే భావన కల్పించేలా రాజమౌళి సినిమా అత్యద్భుతం గా తీశారు.ఇది తెలుగువాడి సత్తా.మీలో ఒక్కొక్కరు ఒక బహుబలిగా తయారవ్వాలి.
చరిత్ర వున్నంత వరకు తెలుగువారి గుండెల్లో వుండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్.తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్.నిజాం చార్మినార్ కట్టిస్తే ఎన్టీఆర్ బుద్దుడి విగ్రహం పెట్టించారు
తెలుగు రాష్ట్రానికి చరిత్రలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి.రాజధానులు మారుతూ వచ్చాం.విభజన మళ్ళీ సమస్యలు తెచ్చింది.2050కి కాలిఫోర్నియాతో పోటీ పడే అమరావతి రూపుదాల్చడం తథ్యం
రాజధాని నిర్మాణానికి డబ్బుల్లేవ్, కానీ ప్రపంచశ్రేణి నగర నిర్మాణాన్ని నిర్మించాలన్న పట్టుదల, సంకల్పం ఉంది. భగవంతుడు రాజధాని నిర్మించే అవకాశం నాకే ఇచ్చాడు. రాజధాని ముహూర్త బలం బాగుంది. అమరావతి నగరం భావితరాలకు మనమిచ్చే ఒక కానుక. అమరావతి ప్రపంచంలోని అత్యుత్తమ 5 నగరాల్లో ఒకటిగా నిలపాలని మీలో ప్రతి ఒక్కరు సంకల్పం తీసుకోవాలి.
కష్టాలు తాత్కాలికం.వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం మనకు వరం.వనరులు, సృజనశీలురైన మానవ వనరులు మన సొంతం.ఒంగోలు గిత్తలు మన బలం. కూచిపూడి నృత్యం మన ఘన వారసత్వం.మీరు సంపాదించిన దాంట్లో కొంత రాష్ట్రాభివృద్ధికి ఇవ్వండి
ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం నాకు దక్కింది.సామాజిక సమస్యలు అనేకం పరిష్కారమయ్యాయి.మహిళలు, పురుషులు కలిసి పనిచేస్తే ఉత్పాదకత పెరిగి సంపద సృష్టించవచ్చని భావించి డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసాను.అభివృద్ధి, సంక్షేమం రెంటికీ సమ ప్రాధాన్యం ఇస్తున్నా.నదుల అనుసంధానం గురించి ఎన్నో ఏళ్లుగా మాట్లాడుతున్నారు, మనం దాన్ని సాధ్యం చేసి చూపించాం
