తెలుగుదేశం పార్టీలో తడబాటు ఎక్కువవుతున్నది. పెద్ద బాబు చన్నబాబులు ఏదో తత్తరపాటు లో ఉన్నట్లున్నారు. ఈ మధ్య బాగా తడబడుతున్నారు. ఏదో చెప్పబోయి మరేదో అంటున్నారు.  ఈ తడబాట్లు,తప్పులు, నాలుక తిరక్కపోవడాలు సోషల్ మీడియా లో హస్యపుజడివాన కురిపిస్తున్నాయి . ఈ విషయంలో తండ్రి,కొడుకులు పోటీపడుతున్నట్లున్నారు. చంద్రబాబు నాయుడు మరొక సారి నిన్న విజయవాడలో ఎలా తడబడ్డారో చూడండి.

తెలుగుదేశం పార్టీలో తడబాటు ఎక్కువవుతున్నది. పెద్ద బాబు చన్నబాబులు ఏదో తత్తరపాటు లో ఉన్నట్లున్నారు. ఈ మధ్య బాగా తడబడుతున్నారు. ఏదో చెప్పబోయి మరేదో అంటున్నారు. ఈ తడబాట్టు,తప్పులు, నాలుక తిరక్కపోవడాలు సోషల్ మీడియాలో హస్యపు జడివాన కురిపిస్తూ ఉంది. ఈ విషయంలో తండ్రి,కొడుకులు పోటీపడుతున్నట్లున్నారు. చంద్రబాబు నాయుడు మరొక సారి నిన్న విజయవాడలో తడబడ్డారు.

బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్‌కు బుధవారం నాడు విజయవాడలో సన్మానం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిధి.కిడాంబిని అభినందిస్తూ అభినందిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ తనకున్న సత్తా ఏమిటో చాటాలనుకున్నారు.

అంతవరకూ బాగానే ఉంది. ఈ వూపులో క్రీడాకారులను తాను ఎంతగా ఉత్సాహపరుస్తాడో కూడా ప్రకటించాలనుకున్నారు.ఈ వూపులో ఒక కొత్త ప్రకటన చేశారు. ఒలింపిక్స్ లో గెలిచినోళ్లకు నోబెల్ ప్రైజ్ ఇస్తామని ప్రకటించారు. సభలో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.

ఈ విషయాన్ని గతంలో కూడా చెప్పానని సగర్వంగా గుర్తు చేశారు.ఇది మరింతగందరగోళానికి దారి తీసింది.

మరొక తడబాటు

కార్యక్రమంలో తొలుత ఆయన అందరికీ అభివాదం తెలిపారు.

అపుడు వేదిక మీదున్న మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావును ఉద్దేశించి ‘మంత్రి బోండా ఉమ గారికి’ అన్నారు.

బాబు సంబోధనతో సభంతా పకపకలతో నిండిపోయింది. అపుడు నాలుక్కొరక్కున్నారు, సారీ.. సారీ మంత్రి దేవినేని ఉమగారికి అని సరిదిద్దుకున్నారు.

 ఇదిలావుంటే, ఢిల్లీ పర్యటనలో ఉన్న బాబు తనయుడు లోకేశ్ సైతం మాట తడబడి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావు జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్య సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పివి నరసింహారావు తెలుగుదేశం పార్టీ నుంచే ప్రధాని అయ్యారంటూ తన విజ్ఞానంతో సభికులను రంజింపచేశారు.

వెంటనే తేరుకుని తెలుగు ప్రజలనుంచి ప్రధాని అయ్యారని మాటమార్చారు, బయటపడ్డారు.