కాపు ఉద్యమాన్ని తూర్పుగోదావరి జిల్లా పొలిమేర దాటించే ప్రయత్నం

కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాయలసీకు తీసుకెళుతున్నారు.

 మొట్టమొదటిసారి ఆయన తన పెట్టని కోట అయిన తూర్పుగోదావరి జిల్లా దాటి కర్నూలు వచ్చి కాపు సత్యాగ్రహంలో పాల్గొనాలనుకుంటున్నారు.

కాపులకు ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు చేసిన‘ద్రోహం’ కు వ్యతిరేకంగా ఫిబ్రవరి 26 న రాష్ట్ర వ్యాపితంగా నిరసన సత్యాగ్రహం చేయాలని ఆయన నిర్ణయించారు. ఇందులో భాగంగా కర్నూలు జరిగే సత్యాగ్రహంలో ఆయన పాల్గొంటున్నారు.

ఈ మధ్య కాలంలో ఆయన ఉద్యమం బాగా నిర్బంధాలకుగురవుతూఉంది. ఆయన తలపెట్టాలనుకుంటున్న్ కాపు పాదయాత్రను ఇప్పటి వరకు మూడుసార్లు ప్రభుత్వం అడ్డుకుంది. యాత్ర ప్రారంభం ముందురోజునే ఆయనను గృహ నిర్బంధం చేసి, ఆయన అనుయాయులను అదుపులోకి తీసుకుని కిర్లంపూడి ఏరియాను పోలీసు క్యాంపుగామార్చడం జరుగుతూ ఉంది. ఆయన రోడ్డు మీదకు రాకుండా చేయడంలో ప్రభుత్వం విజయవంతమయినా, ఈ నిర్భంధం ఆయన ధోరణిని మార్చలేకపోయింది. ఆయన ఉద్యమ స్ఫూర్తిని నీరు గార్చలేదు. ఆయన తిరుగుబాటు తత్వాన్ని గాని, భాషను పల్చబరచలేకపోయింది. అందుకే ఆయన నిరసన ఉద్యమానికి పిలుపిస్తూనే ఉన్నారు.

అయితే, అవన్నీ ఒక ఎత్తు, ఇపుడు ఈ సత్యాగ్రహం ఒక ఎత్తు.

ఇంతవరకు ఆయన జిల్లా పొలిమేర దాటి రాలేదు. ఇపుడు ఆయన కర్నూలు కు వస్తున్నారు.

దీనికి చాలాప్రాముఖ్యం ఉంది: ఒకటి , ఆయన హైపర్ లోక ల్ లీడర్ (పూర్తి స్థానిక నాయకుడు) అనే విమర్శకు సమాధానం ఇది. రెండు, రాయలసీమలోని బలిజలు కాపులతో కలవకుడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. వారికి బిసి హోదా ఇస్తానని హామి ఇచ్చినట్లు సమాచారం.దీని వెనక ఉన్న కుట్ర గురించి వివరించడం. మూడు కాపు ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాపితం చేయడం... అనే అంశాలు ముద్రగడ కర్నూలు యాత్రలో ఉన్నాయి.

 నిరసన ఉద్యమ నాయకులెవరు ఆంధ్రలో తలెత్తకుండాచేస్తున్న ప్రభుత్వం ముద్రగడను కర్నూలుకు అనుమతిస్తుందా? లేక కర్నూలుకు వచ్చాక అరెస్టు చేస్తారా ? వేచిచూడాలి.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపులకు చేసిన ద్రోహానికి నిరసనగా ఈ నెల 26 వ తేదీన ఒక్కరోజు సత్యాగ్రహ దీక్ష చేయాలని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు మాట తప్పారని ఆయన మండిపడ్డారు. దానికి నిరసగానే కాపులందరు ఒక్కరోజు దీక్ష చేపట్టాలని ఆయన కోరారు.

ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తమకు వీలుగా ఉన్న ప్రదేశాల్లో సత్యాగ్రహ దీక్ష చేయాలని ఆయన నిర్ణయించారు. ప్రతి ఒక్కరూ దీక్షలో పాల్గొని తమ జాతికి బీసీ రిజర్వేషన్లు ఇస్తామన్న హామీని అమలు చేయనందుకు నిరసన తెలపాలని ఆయన కోరారు. కర్నూలు జిల్లాలో జరిగే సత్యాగ్రహ దీక్షలో ముద్రగడ పాల్గొననున్నట్టు తెలిపారు.