సంగీత కేసులో మళ్లీ  ఎంపీ మల్లారెడ్డి

First Published 24, Nov 2017, 5:16 PM IST
mp mallareddy meets trs leader srinivas reddy in charlapally jail over sangeeta case
Highlights
  • ఐదురోజులుగా దీక్ష చేస్తున్న సంగీత
  • శ్రీనివాస్ రెడ్డిని జైలులో కలిసిన ఎంపీ మల్లారెడ్డి

టీఆర్ఎస్ యువజన సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి రెండో భార్య సంగీత దీక్ష మరో మలుపు తిరిగింది. సంగీతకి, ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి కి మధ్య ఎంపీ మల్లారెడ్డి రాయబారం నడుపుతున్నారు. ఇప్పటికే సంగీత ఐదు రోజుల నుంచి దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన శ్రీనివాస్ రెడ్డి చర్లపల్లి జైలులో ఉండగా.. అతనిని శుక్రవారం మల్లారెడ్డి కలిసారు. శ్రీనివాస్ రెడ్డితో చర్చలు కూడా జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సంగీత పెట్టిన డిమాండ్లకు శ్రీనివాస్ రెడ్డి ఒప్పుకున్నట్లు ప్రకటించారు. ఇదే విషయంపై సంగీతతో మాట్లాడి ఆమె తో దీక్ష విరమింపచేస్తామని ఆయన తెలిపారు. దీంతో ఈ వివాదం తెరపడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.

శ్రీనివాస్‌రెడ్డి మూడో పెళ్లి చేసుకోవడంతో.. తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని కోరుతూ అతని ఇంటి ముందు గత ఐదు రోజులుగా రెండో భార్య సంగీత నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ రెండు కుటుంబాల మధ్య రాజీ కుదిర్చేందుకు మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, టీఆర్‌ఎస్‌ నేతలు రంగంలోకి దిగారు. 

loader