జూనియర్ ఆర్టిస్టుపై లైంగికదాడి (వీడియో)

First Published 11, May 2018, 1:59 PM IST
movie artist complaint junior artist molestation attack
Highlights

ద్రాక్షరసంలో మత్తుమందు కలిపి 

ప్రేమిస్తున్నానని పెళ్లి చేఐసుకుంటానని మాయ మాటలు చెప్పి, ఓ సినీ నటి, డబ్బింగ్‌ ఆర్టిస్ట్, యాంకర్‌కు మత్తుమందు ఇచ్చి లైంగికదాడికి పాల్పడిన జూనియర్‌ ఆర్టిస్టుపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీశాంత్‌ రెడ్డి శ్రీకృష్ణానగర్‌లో ఉంటూ సినిమా షూటింగ్‌లకు యువతులను సరఫరా చేసే కో–ఆర్డినేటర్‌గానే కాకుండా సినిమాల్లో నటిస్తున్నాడు. గత ఏడాది అక్టోబర్‌లో నటి, యాంకర్, డబ్బింగ్‌ ఆర్టిస్టుతో అతడికి పరిచయం ఏర్పడింది. గత డిసెంబర్‌ 10న బోరబండలోని ఆమె గదికి వెళ్లిన శ్రీశాంత్‌ ద్రాక్షరసంలో మత్తుమందు కలిపి తాగించాడు.

ఆమె మత్తులోకి జారుకున్న అనంతరం లైంగికదాడికి పాల్పడటమే కాకుండా, బీరువాలో ఉన్న 40 తులాల బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల నగదు తీసుకుని పరారయ్యాడు. కొద్దిరోజుల తర్వాత ఆమె నిలదీయగా పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ తర్వాత ఎన్నిమార్లు అడిగినా దాటవేస్తుండటంతో బాధితురాలు శ్రీశాంత్‌రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది జూనియర్ ఆర్టిస్ట్ రోజా.ఇతర జూనియర్ ఆర్టిస్టులతో కలిసి బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన రోజా.. శ్రీశాంత్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. తనపై లైంగిక దాడిచేయడంతో పాటు .. ఇప్పుడు సోషల్‌ మీడియాలో తన గురించి దుష్ప్రచారం చేస్తున్నాడంది. దీనిపైనే శ్రీశాంత్‌రెడ్డిని పోలీసులు స్టేషన్‌లో ప్రశ్నిస్తుండగానే.. రోజాతో పాటు అందరూ కలిసి దాడి చేశారు. అతడిని చెప్పులతో కొట్టారు. అనంతరం తమకు న్యాయం చేయాలంటూ  పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు.

 

loader