95 శాతం నెటిజన్లు పన్నీరు కే పట్టం కట్టారు
తమిళనాడులో నెలకొన్న అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది. మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, శశికళలలో ఎవరికి బలం ఎక్కువగా ఉంది. గవర్నర్ ఎవరికి బలనిరూపణకు అవకాశం ఇస్తారు... ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనేది ఇంకా సస్పెన్స్ గా నే ఉంది.
తమిళనాడులో ఎవరు సీఎం కావాలని ఆన్ లైన్ లో సర్వే చేస్తే... 95 శాతం మంది పన్నీరు కే పట్టం కట్టారు. ‘సీఎంవో తమిళనాడు’ట్విటర్ అకౌంట్ ను పర్యవేక్షిస్తున్న సంస్థ ఈ సర్వే చేపట్టింది.
ఈ సర్వేలో 52 వేల మంది నెటిజన్లు పాల్గొన్నారు.
