Asianet News TeluguAsianet News Telugu

ఆ ఇంజనీరింగ్ కాలేజీలన్నీ మూతపడినట్టే...!

  • తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు 800 ఇంజినీరింగ్ కాలేజీల్లో.. 50 కాలేజీలు మూతపడనున్నాయి
  • ఈ మేరకు ఏఐసీటీయూ నిర్ణయం తీసుకుంది
More than 50 engg colleges face closure in 2018

మన దేశంలో ఇంజినీరింగ్ కళాశాలలు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. పేరుకి అన్ని కాలేజీలు ఉన్నా.. నాణ్యమైన విద్యను అందించడం లోమాత్రం చాలా వెనుకబడి ఉన్నాయి. విద్యార్థులకు కనీసం ల్యాబ్ , లైబ్రరీ సౌకర్యం కూడా కల్పించలేని స్థితిలో ఉన్నాయి. నాణ్యత లేకుండా నాసిరకంగా ఉన్న  ఆ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు కూడా సముఖంగా లేరు. ఉచితంగా సీటు ఇస్తామని పిలిచినా..  చేరేందుకు విద్యార్థులు నిరాకరిస్తున్నారు. చేరిన కొద్దో గొప్పో విద్యార్థులతో.. బండి లాగిస్తున్నారు. అలాంటి కాలేజీల వల్ల వచ్చిన ఉపయోగం ఏమీ లేదని భావించింది ప్రభుత్వం. ఇందుకు ఏఐసీటీయూ కూడా జత కలిసింది. ఇంకేముంది నాసిరకం కాలేజీలన్నీ ఏరివేయడానికి ప్రణాళిక రూపొందించారు.

తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు 800 ఇంజినీరింగ్ కాలేజీల్లో.. 50 కాలేజీలు మూతపడనున్నాయి. ఈ మేరకు ఏఐసీటీయూ నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరంలో ఏయే కళాశాలలను మూసివేయనున్నారో ఓ జాబితాను కూడా తయారు చేసింది. ఆ కాలేజీలు ఖమ్మం, కోదాడ, వరంగల్, యాచారం మండలం, నర్సంపేట్, నిజామాబాద్ ప్రాంతాలలో ఉన్నాయి.

 బ్యాన్ చేసిన కాలేజీలు.. 2018వ సంవత్సరంలో న్యూ అడ్మిషన్లు తీసుకోవడానికి వీలు లేదని  అధికారులు ప్రకటించారు. ఈ కాలేజీలన్నింటిలోనూ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటున్నట్లు తమ సర్వేలో తేలిందని ఏఐసీటీయూ అధికారులు చెప్పారు. ఇప్పటికే కాలజీలో చేరిన విద్యార్థులు మాత్రం.. తన నాలుగేళ్ల కోర్సును పూర్తి చేయడానికి అనుమతి కల్పిస్తున్నారు. కాగా.. కొత్తగా ఎవరినీ చేర్చుకోవడానికి వీలు లేదని చెప్పారు.

5 సంవత్సరాలుగా కనీసం 30శాతం విద్యార్థులు లేని కళాశాలలను మాత్రమే తాము మూసివేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న కాలేజీలు.. మూసి వేయడం ఇష్టం లేకపోతే.. మరో కాలేజీతో విలీనం కావచ్చని వారు పేర్కొన్నారు.

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలలో ఉన్న కాలేజీల్లో చదివేందుకు విద్యార్థులు ఎక్కవ గా ఆసక్తి చూపడం లేదు. దీంతో ఏఐసీటీయూ ఈ నిర్ణయం తీసుకుందని జేఎన్టీయూ హైదరాబాద్ రిజిస్టార్ యాదయ్య అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios