ఆమెతో రాహుల్ గాంధీకి వివాహమా: అదితి ఏమంటున్నారు?

MLA Aditi upset over rumours of marraige with Rahull gandhi
Highlights

సామాజిక మాధ్యమాల్లో పుకార్లకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.

లక్నో: సామాజిక మాధ్యమాల్లో పుకార్లకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. అన్నాచెల్లెళ్లుగా భావించుకునే ఇద్దరికి ఊహాతీతమైన సంబంధాన్ని అంటగట్టి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాయ్ బరేలీ శాసనసభ్యురాలు అదిత సింగ్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 

ఈ ప్రచారం రాయ్ బరేలీలోని వాట్సప్ గ్రూపుల్లో మొదలైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వారిద్దరు ఫొటోలను కలిపి సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం చేశారు. వీరిద్దరు ఈ నెలలోనే ఒక ఇంటివారవుతున్నట్లుగా కూడా ప్రచారం సాగించారు. 

ఈ పుకార్లపై అదితి సింగ్ స్పందించారు. తనకు రాహుల్ గాంధీతో వివాహం జరగబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆమె అన్నారు. రాహుల్ గాంధీని తాను అన్నయ్యగా భావిస్తానని చెప్పారు. తాను రాహుల్ గాంధీకి రాఖీ కట్టానని, ఆయన తన అన్నయ్య అని అన్నారు. 

సామాజిక మాధ్యమాల్లో ప్రచారానికి తాను తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలిపారు. రాయ్ బరేలీ నుంచి ఐదు సార్లు శాసనసభ్యుడిగా విజయం సాధించిన అఖిలేష్ కూతురు అదితి. ఆమె అమెరికాలోని డ్యూక్ విశ్వవిద్యాలయంలో మేనేజ్ మెంట్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారు ఆమె అదే నియోజకవర్గం నుంచి 90 వేల మెజారిటీతో శాసనసభకు ఎన్నికయ్యారు. 29 ఏళ్ల అదితి ప్రియాంక వాద్రాకు సన్నిహితురాలని తెలుస్తోంది.

loader