పెళ్లైన మరు క్షణం బాయ్ ప్రెండ్ తో పెళ్లి కూతురు జంప్ గొడవ పడ్డ ఇరు కుటుంబాలు పండుగ చేసుకున్న పెళ్లికొడుకు
పెళ్లి జరిగిన మండపంలో అమ్మాయి బాయ్‌ప్రేండ్ కనిపిస్తే పెళ్లికూతురు తన బాయ్ ప్రెండ్ తో పారిపోయింది. వాళ్లు పారిపోవడానికి సపోర్టు చేసిన పెళ్లికొడుకు. చివరికి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే కేరళ రాష్ట్రంలో గురువాయూర్ ప్రాంతంలో సంతోష్, స్మిత అనే ఇరువురికి ఆదివారం పెళ్లి జరిగింది. పెళ్లి అయిన తరువాతి నిమిషం స్మితకు తన బాయ్‌ప్రెండ్ మండపంలోకి వచ్చాడు. అప్పుడు స్మిత తనని పెళ్లి చేసుకున్న సంతోష్ కి తన నా బాయ్‌ప్రెండ్ అని పరిచయం చేసింది. ఇప్పటికి తననే ప్రేమిస్తున్నట్లు స్మిత తన పెళ్లి చేసుకున్న అబ్బాయితో చెప్పింది. పెళ్లి కొడుకు కూడా ఏమీ అనలేదు. దీంతో పెళ్లి కూతురు బాయ్‌ప్రెండ్ తో పెళ్లి పీటల మీద నుండి పారిపొయింది.
ఇక అమ్మాయి, అబ్బాయి తల్లిదండ్రుల మధ్య గొవడ జరిగింది. అమ్మాయి కుటుంబ సభ్యులు పెళ్లి కొడుకు నష్ట పరిహారం ఇస్తామని తెలిపారు. ఇక ఇక్కడ కాస్తా ఆశ్చర్యానికి గురిచేసే విషయం ఎంటంటే పెళ్లి కొడుకు తను చేసుకున్న అమ్మాయి పారిపోయిందని తెలిసి కేక్ కోసి తన మిత్రులతో సెలబ్రేషన్ చేసుకున్నాడు.
