తన నియోజకవర్గంలో జిహెచ్ ఎంసి ఎలా పనిచేస్తున్నదో మంత్రి తలసానికి తెలిసొచ్చింది

సిటిలో తలసాని శ్రీనివాస యాదవ్ అంటే అందరికీ ఎరికే. హైదరాబాద్ అష్ట దిగ్గజాలలో ఆయన ఒకరు. అందుకే ఆయన టిడిపి నుంచి వచ్చినా, ఎపుడు జై తెలంగాణా అనక పోయినా, కెసిఆర్ నె మెప్పించిండు, మంత్రి అయి కూచున్నడు.

ఇంత పాలెగాడి నియోజకవర్గం ఎలా ఉండాలి...అది కంపు గొడతా ఉంది.

తనకు ఓటేసి గెలిపించిన నియోజకవర్గం సనత్ నగర్ ఎంత కంపుకొడుతున్నదో పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ నిన్న స్వయంగా చూసి తెలుసుకున్నారు. ముక్కు మూసుకున్నాడు.

సనత్ నగర్ నియోజకవర్గంలో జిహెచ్ ఎంసి అధికారులు నాలాలను శుభ్రంచేయడంగాని, రోడ్ల మీద చెత్త ఎత్తేయడం గాని చేయడం లేదని ఆయన అదివారం నాడు కనుగొన్నారు.

ఎన్నాళ్లయిందో ఏమో, ఒక రౌండలా హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న సనత్ నగర్ నియోజకవర్గం చూడాలనుకుని మంది మార్బలం జమచేసుకుని అకస్మికంగా బయలు దేరారు. అక్కడ క్కడ ప్రజలతో స్వయంగా మాట్లాడారు.

అంతే, సనత్ ఎంత కంపుగొడుతున్నదో ఆయన కు వివరించారు. మునిసిపల్ అధికారులసలు పట్టించుకోవడం లేదని, నాలాలలో చెత్త పేరుకుపోయిందని, దానిని తీసేయక పోవడంతో కుళ్లిపోయి కంపుగొడుతూ ఉందని వారు చెప్పారు. ఆయన వెంటనే మునిసిపల్ అధికారుల మీద మండిపడ్డారు. చెత్త వెంటనే ఎత్తేయాలని, పశువులు రోడ్ల మీద తిరుక్కుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

మంత్రులు ఎపుడో ఒకసారి ఇలా దర్శనమిస్తే ఇదే సమస్య.

ఓటేసిన గల్లీలలో అపుడపుడు తిరుగుతూ ఉంటే ప్రజలెలా వున్నారో, మునిసిపాలిటోళ్లు ఎంచేస్తున్నారో తెలుస్తుంది. అంతేకాదు, సాటి మునిసిపల్ మంత్రి గారి పాలన ఎలా ఉందో కూడా తెలిసొస్తుంది.