జగన్ కి మంత్రి సోమిరెడ్డి కౌంటర్..!

First Published 24, Nov 2017, 4:55 PM IST
minister somireddy chandra mohan reddy counter attack to ys jagan
Highlights
  • వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్
  • జగన్ చెప్పిన మాటలను జగన్ కే తప్పి కొట్టారు.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. జగన్ చెప్పిన మాటలను జగన్ కే తప్పి కొట్టారు.  జగన్ ని రాజకీయాల నుంచి తప్పుకోవాలంటూ హితవు పలికారు. అసలు విషయం ఏమిటంటే.. అక్రమాస్తులను కూడబెడుతున్న వారి జాబితాను ఇటీవల  ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విడుదల చేసిందంటూ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ జాబితాలో పలువురు రాజకీయ ప్రముఖులు ఉన్నారని.. అందులో జగన్ పేరు కూడా ఉందటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

కాగా.. ఈ విషయంపై శుక్రవారం పలువురు టీడీపీ నేతలు ప్రస్తావించారు. ఇదే అదునుగా తీసుకొని జగన్ పై పలువిమర్శలు చేశారు. అలా విమర్శలు చేసిన వారిలో మంత్రి సోమిరెడ్డి కూడా ఉన్నారు. సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ  విడుదల చేసిన అక్రమార్కుల టాప్ 10 జాబితాలో జగన్ ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. జగన్.. దొంగ కంపెనీలు పెట్టి.. వందల కోట్లు కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. జగన్ తన పాదయాత్రలో అవినీతిపరులు రాజకీయాల్లో ఉండకూడదని చెబుతున్న విషయాన్ని గుర్తు చేశారు. జగన్ చెప్పినదాని ప్రకారం.. ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిందే కదా అంటూ ప్రశ్నించారు. జగన్.. పాదయాత్రలు చేయడం మానేసి.. ప్రతిపక్ష పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు చెబుతున్న మాటలను ప్రజలు నమ్మడం లేదన్నారు. అసలు జగన్ మీద ప్రజలకు నమ్మకమే లేదని మంత్రి పేర్కొన్నారు.

loader