Asianet News TeluguAsianet News Telugu

అదిరిపోయే ఫీచర్లతో మైక్రోమ్యాక్స్ కొత్త ఫోన్

  • ఎడ్జ్‌-టూ-ఎడ్జ్‌ డిస్‌ప్లే, డ్యూయల్‌ సెల్ఫీ కెమెరాలతో రూ.13,999కు ఈ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి వచ్చింది.
  • ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ సైట్‌పై ఈ నెల 6 నుంచి విక్రయానికి రానుంది.
Micromax Canvas Infinity Pro with  edge to edge screen dual selfie cameras launched at Rs 13999

దేశీయ మొబైల్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్.. మరో కొత్త స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఇన్ఫినిటీ ప్రో పేరిట ఈ ఫోన్ ని విడుదల చేసింది. ఎడ్జ్‌-టూ-ఎడ్జ్‌ డిస్‌ప్లే, డ్యూయల్‌ సెల్ఫీ కెమెరాలతో రూ.13,999కు ఈ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ సైట్‌పై ఈ నెల 6 నుంచి విక్రయానికి రానుంది. ఈ ఫోన్‌లో 5.7 ఇంచ్ భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. మరోవైపు ఇది బెజెల్ లెస్ డిస్‌ప్లే అయినందున యూజర్లకు ఫోన్ తెరను చూసేటప్పుడు ఫుల్ వ్యూ అనుభూతి కలుగుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కీ ఫీచర్లుగా పోర్ట్రైట్‌ మోడ్‌, ఫేస్‌ బ్యూటీ, ఆటో సీన్‌ డిటెక్షన్‌, ఫేస్‌ గ్యాలరీ, టేల్‌ ఆల్బమ్‌లున్నాయి.

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఇన్ఫినిటీ ప్రో ఫీచర్లు..

5.7 ఇంచెస్ ఫుల్ విజన్ డిస్ప్లే 

1440 X 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్
4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.1 నోగట్
డ్యుయల్ సిమ్
16 మెగాపిక్సల్ వెనుక కెమెరా
20, 8 మెగాపిక్సల్‌తో డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు
 ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2
 3000 ఎంఏహెచ్ బ్యాటరీ

Follow Us:
Download App:
  • android
  • ios