సొంత బావనే నరికి చంపిన బామ్మర్దులు

First Published 22, Dec 2017, 12:39 PM IST
man killed by brothers in law in Hyderabad
Highlights
  • మల్కాజ్ గిరి కోర్టు ఆవరణలో దారుణ హత్య
  • శ్రీధర్ అనే వ్యక్తిని నరికి చంపిన దుండగులు

కుటుంబ కలహాలతో సొంత బావనే బావమరుదులు కత్తులతో నరికి చంపిన సంఘటన మల్కాజ్ గిరి ప్రాంతంలో జరిగింది. తమ అక్కతో తరచూ గొడవలు పడుతున్నందుకే వారు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే  శ్రీధర్, సుహాసిని లకు గత కొన్నేళ్ల క్రితం వివాహమైంది. హైదరాబాద్ లో నివాసముంటున్న వీరి మద్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో విడాకులు తీసుకోవాలని బార్యాభర్తలు నిర్ణయించుకున్నారు. ఇపప్పటికే ఇద్దరు విడివిడిగా ఉంటూ విడాకుల కోసం గత కొన్ని రోజులుగా మల్నాజ్ గిరి కోర్టకు హాజరవుతున్నారు.

ఈ క్రమంలో ఇవాళ కోర్టుకు హాజరైన శ్రీధర్ వాదనలు ముగిసిన తర్వాత బయటకు పాన్ షాప్ వద్ద నిలుచున్నాడు. అయితే అతడితో మాట్లాడాలని చెప్పిన బావమరుదులు పక్కకు తీసుకెళ్లారు. అక్కడ పథకం ప్రకారం ముందుగానే తెచ్చుకున్న కత్తులతో బావ శ్రీధర్ ను నరికి చంపారు. ఈ తర్వాత నిందితులిద్దరు పరారయ్యారు.
  
ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

loader