ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ ఐపీఎస్‌ అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో డీజీపీ నండూరి సాంబశివరావు, నిఘా విభాగాధిపతి ఏబీ వెంకటేశ్వరరావు ఇప్పటికే రెండు సార్లు సమావేశమై బదిలీల జాబితాపై కసరత్తు పూర్తిచేసినట్లు సమాచారం.మంగళ, బుధవారాల్లో వీటికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు విడుదల కానున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ల బదిలీలకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో డీజీపీ నండూరి సాంబశివరావు, నిఘా విభాగాధిపతి ఏబీ వెంకటేశ్వరరావు ఇప్పటికే రెండు సార్లు సమావేశమై బదిలీల జాబితాపై కసరత్తు పూర్తిచేసినట్లు సమాచారం.
మంగళ, బుధవారాల్లో వీటికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు విడుదల కానున్నాయి. తాజా మార్పులు, చేర్పుల్లో భాగంగా రాష్ట్రంలోని 10 జిల్లాల ఎస్పీలకు స్థానచలనం కలగనున్నట్లు సమాచారం. రాయలసీమ పరిధిలోని అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, తిరుపతి అర్బన్ ఎస్పీల స్థానంలో కొత్త ఎస్పీలు రానున్నారు. చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్కు డీఐజీగా పదోన్నతి లభించిన నేపథ్యంలో ఆ స్థానం ఖాళీ కానుంది.
అనంతపురం, కర్నూలు జిల్లాల ఎస్పీలు రాజశేఖర్ బాబు, ఆకే రవికృష్ణ ఇప్పటికే ఆయా జిల్లాల్లో 2 సంవత్సరాల 11 నెలలు పూర్తి చేసుకోవడంతో వారిని బదిలీ చేయనున్నారు. గుంటూరు అర్బన్, గుంటూరు రూరల్, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల ఎస్పీలు కూడా రెండేళ్ల కాలపరిమితి పూర్తవ్వడంతో వారి స్థానంలో వేరే వారిని నియమించనున్నారు.
గతేడాది మే నెలలో బాధ్యతలు చేపట్టిన కడప ఎస్పీ పీహెచ్డి.రామకృష్ణను ఆ జిల్లా మంత్రి, అక్కడి నాయకులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో బదిలీ చేస్తారనే ప్రచారం నడుస్తోంది. తిరుపతి అర్బన్, విజయనగరం, శ్రీకాకుళం ఎస్పీలకు స్థానచలనం తప్పదని సమాచారం. విశాఖపట్నం, గుంటూరు ఐజీలు కుమార్ విశ్వజిత్, ఎన్.సంజయ్ల స్థానంలో ఆయా జోన్లకు కొత్త ఐజీలు రానున్నారు. ఎర్రచందనం కార్యదళం డీఐజీ ఎం.కాంతారావు, మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ మహ్మద్ ఇక్బాల్లు ఇటీవలే ఐజీలుగా పదోన్నతి లభించింది. ప్రస్తుతం ఏసీబీలో పనిచేస్తున్న నాగేంద్ర కుమార్కు ఎస్పీ నుంచి డీఐజీగా పదోన్నతి లభించింది. వీరికి ఆ హోదాలో పోస్టింగులు ఇవ్వాల్సి ఉంది. మరోవైపు సీఐడీ విభాగాధిపతి సీహెచ్.ద్వారకా తిరుమలరావు, విజయవాడ సీపీ గౌతం సవాంగ్లను ఆ స్థానాల నుంచి బదిలీ చేస్తారన్న ప్రచారం నడుస్తోంది.
