తల్లీ, పిల్లలను బలిగొన్న అక్రమసంభందం

తల్లీ, పిల్లలను బలిగొన్న అక్రమసంభందం

పిల్లాపాపలతో ఆనందంగా జీవనం సాగిస్తున్న కుటుంబంలో భర్త అక్రమ సంభందం తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబ కలహాలు తల్లితో పాటు ఇద్దరు చిన్నారులను బలిగొన్నాయి.తన భర్తకు వేరే మహిళతో  అక్రమ సంభందం ఉందని తెలిసి ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట మండలం కొండాపూర్‌లో చోటు చేసుకుంది.
 
 ఆత్మహత్యలకు సంభందించిన వివరాలిలా ఉన్నాయి.  మహబూబ్ నగర్ కొండాపూర్ గ్రామానికి చెందిన వడ్డె సత్తయ్య, యశోద దంపతులు తమ కుటుంబం కలిసి ఉపాది కోసం హైదరాబాద్ కు  వచ్చారు. సత్తయ్య ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే హైదరాబాద్ కి వచ్చాక అతడికి వేరే మహిళతో అక్రమ సంభందం ఏర్పడింది.  ఈ విషయం యశోదకు తెలియడంతో వీరి కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. ఈ గొడవలు మరీ ఎక్కువవడంతో యశోద తన పిల్లలతో కలిసి సొంత ఊరికి వెళ్లింది.

 అయితే ఎన్నిరోజులైనా భర్త తమను తీసుకుపోవడానికి రాకపోవడంతో యశోద తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ క్రమంలో  చిన్న కుమారుడు ఆంజనేయులు(10), కూతురు భాగ్యలక్ష్మి(4) తో కలిసి యశోద బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.  తల్లీ, తమ్ముడు, చెల్లి ముగ్గురు కనిపించకపోవడంతో అనుమానంతో పెద్ద కొడుకు సుదర్శన్ వారికోసం వెతగ్గా ఓ బావిలో ముగ్గురి శవాలు కనబడ్డాయి. 

దీంతో అతడు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని శవాలను బయటకు తీసి పోస్టుమార్టం కోసం పంపించారు. దీనిపై
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page