మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

mahaboobabad road accident
Highlights

  • మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం
  • ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి
  • మృతుల్లో ఓ చిన్నారి కూడా

మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని తొర్రూరు మండలం మాటెడు గ్రామం వద్ద ఓ కారు ముందు వెళుతున్న లారీని వేగంగా ఢీ కొట్టడంతో భారీ ప్రమాదం సంభంవించింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యవాతపడ్డారు. మృతులు నెల్లికుదురు మండలం వావిలాల గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి, భార్య మాధవి, కుమార్తె కృష్ణవేణి, తల్లీ లక్ష్మీలుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఒకేసారి మృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. 

loader