ఆంధ్ర నిరుద్యోగులకు మరొక తీపి కబురు

ఆంధ్ర నిరుద్యోగులకు మరొక తీపి కబురు

రెండేళ్లలో లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పిస్తానని ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శుక్రవారం ఆయన మంగళగిరి ఆటోనగర్ లో అక్షర ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సెంటర్  భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండేళ్లలో లక్ష ఐటీ, రెండు లక్షల ఎలక్ట్రానిక్ ఉద్యోగాలను కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. 2018లో మంగళగిరిలో యువతకు పదివేల ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.

 

ఐటీ లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు నిర్విరామంగా కృషి చేస్తున్నారని లోకేష్ తెలిపారు. ఇంటర్నేషనల్,డొమెస్టిక్ ఐటీ కంపెనీలు డెవలప్ చేసేందుకు విశాఖపట్నంలో 13లక్షల చదరపు అడుగుల భూమి కేటాయిస్తానని హామీ ఇచ్చారు. గన్నవరం ఐటీ హబ్ ద్వారా యువతకు భవిష్యత్తులో 3వేల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్ లో 10 మొబైల్ ఫోన్స్ తయారౌతాయన్నారు. మరో ఆరు నెలల్లో సెకండ్ ఫేజ్ టవర్ నిర్మాణం చేపడుతున్నామని లోకేష్ చెప్పారు. ఏపీలో ఐటీ కంపెనీలు ప్రోత్సాహానికి కృషి చేస్తున్నామన్నారు. మరో రెండేళ్లలో  ఐటీ కంపెనీల నిర్మాణానికి కోటి చదరపు అడగుల భూమిని కేటాయించాలనుకుంటున్నట్లు చెప్పారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos