సినారె అసలు పేరు సింగిరెడ్డి నారాయణ రెడ్డి. గడచిన ఐదు దశాబ్దాలుగా సినారెకు సినీప్రపంచంతో విడదీయరాని బంధముంది. మొత్తం 3 వేల పాటలు రాసారు. ‘విశ్మంభర’ రచనకు సినారె జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్నారు. రాజ్యసభ మాజీ సభ్యుడు, తెలుగు విశ్వవిద్యాలయంకు వైస్ ఛాన్సలర్ గా కూడా పనిచేసారు.
ప్రముఖ సాహితీ వేత్త, సినీ కవి సి. నారాయణ రెడ్డి కన్నుమూసారు. ఈరోజు ఉదయం సుమారు 8 గంటల ప్రాంతంలో గుండెపోటుతో మరణించారు. సినారె గా బాగా పాపులరైన రెడ్డిగారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈరోజు ఉదయం పరిస్ధితి విషమించటంతో కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సినారె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
సినారె అసలు పేరు సింగిరెడ్డి నారాయణ రెడ్డి. గడచిన ఐదు దశాబ్దాలుగా సినారెకు సినీప్రపంచంతో విడదీయరాని బంధముంది. మొత్తం 3 వేల పాటలు రాసారు. ‘విశ్మంభర’ రచనకు సినారె జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్నారు. రాజ్యసభ మాజీ సభ్యుడు, తెలుగు విశ్వవిద్యాలయంకు వైస్ ఛాన్సలర్ గా కూడా పనిచేసారు. ఎన్నో గ్రంధాలు, కథలు రాసారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్ధల నుండి ఎన్నో పురస్కారాలు కూడా అందుకున్నారు.
1977 పద్మశ్రీ, 1978లో కళాప్రపూర్ణ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఉర్దు, తెలుగు భాషలపై సినారెకు అపారమైన పట్టుంది. మొన్ననే దర్శకరత్న దాసరి నారాయణ రావు మరణంతోనే చిన్నబోయింది సినీ ప్రపంచం. ఇపుడు సినారెకు కూడా తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారంటే ప్రముఖులు నమ్మలేకున్నారు. 1992లో పద్మభూషణ్ అందుకున్నారు. 1988లో రాజా-లక్ష్మి అవార్డు కూడా అందుకున్నారు. 1931లో హనుమాజీ పేటలో సినారె జన్మించారు.
