మీ ఇంట్లో నల్లడబ్బు బాగా ఉందా.. ఐ.టి. అధికారుల దాడి నుంచి తప్పించుకోవాలా.. అయితే ఈమెను ఫాలో అవ్వండి.
మీ ఇంట్లో నల్లడబ్బు బాగా ఉందా.. ఐ.టి. అధికారుల దాడి నుంచి తప్పించుకోవాలా.. అయితే ఈమెను ఫాలో అవ్వండి.
మీ నల్లడబ్బు పదిలంగా ఉండొచ్చు.. ఐ.టి. అధికారులు ఆస్పత్రిలో ఉండొచ్చు.
బెంగళూరులోని యశ్వంత్ పూర్ పరిధిలోని ఒకరి ఇంట్లో పెద్ద మొత్తంలో నల్లడబ్బు ఉందని ఐ.టి. అధికారులకు సమాచారం అందింది. దీంతో వాళ్లు వెంటనే అపార్ట్మెంట్ లో ఉంటున్న వారి ఫ్లాట్ ను చుట్టుముట్టారు. ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఇంతలో ఆ ఇంటి యజమానురాలు
అధికారులపై గుర్రుమంది. పర్మిషన్ లేకుండా ఇంట్లోకి వస్తారా.. అంటూ తాను ప్రేమగా పెంచుకుంటున్న రెండు కుక్కలను వారిపై ఉసిగొల్పింది. ఇంకేముంది ఐ.టి. అధికారులు అక్కడి నుంచి పరుగోపరుగు.
చివరికి పోలీసుల సహకారంతో మళ్లీ వాళ్లు ఆ ఇంటిపై దాడి చేసి 2 కోట్ల 89 లక్షల నగదు బయటపడింది. ఇందులో 2కోట్ల 25 లక్షలు కొత్త 2 వేల నోట్లు కావటం విశేషం. మొత్తం డబ్బును సీజ్ చేశారు.
