ఉరివేసుకోమని ప్రియుడికి చున్నీ ఇచ్చిన యువతి

Lady gave her Scorff to her boyfriend to hang
Highlights

ఆ చున్నీతోనే ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య
 

మూడేళ్ల ప్రేమ మూడు నిమిషాల్లో ముగిసిపోయింది. మేనకోడలిని పెళ్లి చేసుకొని జీవితాంతం సంతోషంగా జీవించాలని అనుకున్నాడు. కానీ.. ఆస్తి లేని కారణంగా వారి ప్రేమను పెద్దలు కాదన్నారు. ప్రియురాలి మనసు మార్చారు. మనస్థాపంతో ఆ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే..  కరాటం వీరబాబు అనే యువకుడు ఇటీవల డిగ్రీ పూర్తి చేశాడు. అతనికి వరసకు మేనకోడలు అయ్యే యువతి రమ్య.. తనను ప్రేమిస్తున్నానంటూ వెంటపడింది. ఆమె ప్రేమను వీరబాబు కూడా అంగీకరించాడు.  మూడు సంవత్సరాల పాటు వారి ప్రేమ బాగానే సాగింది. కానీ వీరి వ్యవహారం
రమ్య ఇంట్లో వాళ్లకు తెలిసింది. వీరబాబుకి ఆస్తి లేదని చెప్పి.. ఆమె మనసు మార్చేశారు. ఆస్తి కోసమే తన కూతురి వెంట పడ్డావంటూ ఆమె తండ్రి వీరబాబుని నానా మాటలు అన్నాడు.

ఇదే విషయం గురించి వీరబాబు రమ్యను ప్రశ్నించగా.. కావాలంటే చచ్చిపోమ్మని తన చున్నీ ఇచ్చింది. అదే చున్నీతో వీరబాబు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చివరగా తన చావును రమ్యే కారణమంటూ తన తల్లిదండ్రులకు సూసైడ్ లేఖ రాసి మరీ చనిపోయాడు. ప్రస్తుతం అతని సూసైడ్ లేఖ, వీరబాబు, రమ్య కలిసి
దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

loader