ప్రియుడి కోసం భ‌ర్త‌కు క‌రెంట్ షాక్ .

Lady gave current shock to her husband with her boy friend
Highlights

ప్రియుడు గౌరీ నాయుడుతో కలిసి ప‌థ‌కం ర‌చించింది

ప్రియుడి కోసం క‌ట్టుకున్న భ‌ర్త‌కు క‌రెంట్ షాక్ పెట్టి ఉరి వేసి దారుణ హ‌త్య చేసిన ఉదంత‌మిది. విహ‌హేత‌ర సంబంధం ఉన్న విష‌యం భ‌ర్త‌కు తెలియ‌డంతో ఓ మ‌హిళ ప్రియుడితో క‌లిసి భ‌ర్త‌ను మ‌ట్టుబెట్టింది.

శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన సింహాచ‌లం (39) కుటుంబంతో వ‌ల‌స వ‌చ్చి హైద‌రాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. సింహాచ‌లం భార్య విజ‌య‌మ్మ‌తో క‌లిసి బొంత‌లు కుడుతూ కుటుంబ జీవ‌నం సాగిస్తున్నారు.

వీరికి స్థానిక జ‌య‌రాంన‌గ‌ర్‌కు చెందిన ఫైనాన్స్ వ్యాపారీ గౌరీ నాయుడుతో ప‌రిచ‌యం ఏర్ప‌డింది.

అత‌ని వ‌ద్ద సింహాచ‌లం కుటుంబం కొంత అప్పు తీసుకుంది. ఇదే అద‌నుగా చేసుకున్న గౌరీ నాయుడు త‌రుచూ.. వారికి ఇంటికి వ‌స్తూ విజ‌య‌మ్మ‌తో ప‌రిచ‌యం పెంచుకున్నాడు. ఆ త‌ర్వాత ఈ ప‌రిచ‌యం విహేత‌ర సంబంధానికి దారి తీసింది. గౌరీ నాయుడు, విజ‌య‌మ్మ భ‌ర్త లేన‌ప్పుడు క‌లుస్తూ ఉండేవారు.

శుక్ర‌వారం రాత్రి వారిద్ద‌రు చ‌నువుగా ఉండ‌డాన్ని భ‌ర్త సింహాచలం చూశాడు . మ‌ద్యం సేవించి వ‌చ్చి విజ‌య‌మ్మ‌తో గొడ‌వ‌ప‌డి ప‌డుకున్నాడు. ఉద‌యం అంద‌రూ లేచి స‌రికే.. సింహాచ‌లం శ‌వ‌మ‌య్యాడు. సింహాచ‌లం ఒంటి మీదా గాయ‌లు ఉండ‌డంతో అనుమానం వ్య‌క్తం చేశారు.

ప్రియుడు గౌరీ నాయుడుతో కలిసి ప‌థ‌కం ర‌చించింది. శ‌నివారం తెల్ల‌వారు జామున 3 గంట‌ల స‌మ‌యంలో గౌరీ నాయుడు వాళ్లింటికి వ‌చ్చాడు. ఫుల్‌గా మ‌ద్యం సేవించి నిద్ర‌లో ఉన్న సింహాచలానికి తొలుత క‌రెంట్ షాక్ పెట్టారు. ఆ త‌ర్వాత మెడ‌కు ఉరి తాడు వేసి దారుణంగా హ‌త్య చేసిన‌ట్లు పోలీసుల ముందు విజ‌య‌మ్మ ఒప్పుకుంది. 

 

 

loader