కర్నూలు జిల్లా పత్తికొండలో ఓ దుండగుడు స్కూల్ విద్యార్థునులను కిడ్నాప్‌ చేయడానికి ప్రయత్నించి కలకలం సృష్టించాడు. అతడు విద్యార్థినులకు మాయమాటలు చెప్పి ఆటోలో ఎక్కించుకోడానికి ప్రయత్నించగా గమనించిన స్థానికులు అతడిని అడ్డుకున్నారు. దీంతో అతడు బ్లేడ్ తో విద్యార్థునులపై దాడి చేసి గాయపర్చారడు.

వివరాల్లోకి వెళితే పత్తికొండలో ఐదుగురు విద్యార్థినులు నడుచుకుంటూ స్కూల్ కి వెళుతున్నారు.  దారిలో వారిని అడ్డుకున్న ఓ దుండగుడు ఆటోలో ఎక్కాలని, తమను స్కూల్ కి తీసుకువెళతానని నమ్మబలికేందుకు ప్రయత్నించాడు. అయితే దానికి వారు తిరస్కరించడంతో బలవంతంగా ఆటోలో ఎక్కించడానికి ప్రయత్నించగా బాలికలు కేకలు వేశారు. ఈ కేకలను విన్న స్థానికులు అక్కడికి చేరుకునేలోగా దుండగులు విద్యార్థుల చేతులను బ్లేడ్ లతో కోసి పరారైయ్యారు. 

దీంతో స్థానికులు విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు.  ఈ వ్యవహారాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.