అమ్మకు జై... చిన్నమ్మకు నై అంటున్న కోలీవుడ్

తమిళనాట రాజకీయాలకు వెండితెరకు అవినాభావ సంబంధం ఉంది. ఎంజీఆర్, కరుణానిధి నుంచి జయలలిత వరకు అందరూ సినీరంగంలో ఆరంగేట్రం చేసి రాజకీయాల్లో రాణించినవారే.

అమ్మ మృతి తర్వాత అక్కడ రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. సీఎం గా పన్నీరు సెల్వంను రాజీనామా చేయించి అతడి స్థానంలో చిన్నమ్మ కూర్చొడానికి స్కెచ్ వేసిన నేపథ్యంలో అనుకోని అడ్డంకులు వస్తున్నాయి.

కోర్టు నుంచి అడ్డంకులు తొలగలేదు. మరోవైపు గవర్నర్ ఇప్పటి వరకు చెన్నైకి వెళ్లనే లేదు. ఇక ఇన్నాళ్లు అమ్మకు అండగా ఉన్న కోలీవుడ్ సెలబ్రెటీలు ఇప్పుడు చిన్నమ్మకు మాత్రం జై కొట్టడం లేదు. అమ్మకు వీరవిధేయుడిగా పేరుతెచ్చుకున్న పన్నీరు వెంటే వెండితెర తారాగణం నిలుస్తోంది.

నిన్నటి నుంచి జరుగుతున్న రాజకీయ పరిణామాలతో విసుగెత్తిన్న నటుడు కమల్ హసన్ మొదట దీనిపై స్పందించారు. ఆ తర్వాత అతడిని ఫాలో అవుతూ మిగిలిన నటులు స్పందిస్తున్నారు.

ముఖ్యంగా అరవింద స్వామి, ఖుష్బూ, గౌతమి, మాధవన్, ఆర్య తదితరులు పన్నీర్‌ సెల్వానికే మద్దతు పలుకుతున్నారు. మెరీనా బీచ్‌లో అమ్మ సమాధి వద్ద పన్నీరు చేసిన దీక్షను, శశికళకు వ్యతిరేకంగా ఆయన పోరాడుతున్న తీరును కొనియాడుతున్నారు.

ఇంతకీ ఎవరెవరూ ట్విటర్ లో ఏలా స్పందించారంటే...



కమల్‌ హాసన్‌: తమిళ ప్రజలారా తొందరగా పడుకోండి. రేపు వాళ్లు మనకంటే ముందే నిద్రలేస్తారు. గుడ్‌నైట్‌...

గౌతమి: అంతరాత్మను అనుసరించి నడిచే ధైర్యం పన్నీరుకే ఉంది. ఇది తమిళనాడుకు, అమ్మకు న్యాయం చేయడటమే.

ఖుష్బూ: పన్నీరు మౌనాన్ని వీడి మన ముందుకు హీరోగా వచ్చారు. డ్రామా ఇప్పుడే మొదలైంది. దేశ రాజధానికి చెందిన 56 ఇంచుల ఛాతి ఉన్న నాయకుడి తరఫున పన్నీరు పనిచేయడని విశ్వసిస్తున్నా.

సిద్ధార్థ: మెరీనాలో పన్నీరు . ... తమిళనాడు రాజకీయాలు గేమ్‌ ఆఫ్‌ థోర్న్స్‌, హౌస్‌ ఆఫ్‌ కార్డ్స్‌ సినిమాలను గుర్తు చేస్తున్నాయి.

ఆర్య : సన్నీరు సెల్వం గారు మీరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. ధైర్యంగా మాట్లాడారు. హాట్సాప్‌ టూ యూ.

అరవింద స్వామి: బటానీలు తింటూ న్యూస్‌ చూస్తున్నా... హుప్స్‌ (ఓపీఎస్‌) ఒకటి పగిలింది. ఇక పాప్‌కార్న్‌ తింటా.