బస్సులో ప్యాంట్ విప్పి నీచం.. (వీడియో)

First Published 16, May 2018, 11:55 AM IST
Kolkata bus incident viral video
Highlights

ఇద్దరు మహిళలు చూస్తుండగా

బస్సులో మహిళల ముందే వికృత చేష్టలకు దిగాడు ఓ కామాంధుడు. వారికి సైగలు చేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. కండక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవటంతో ఆ తతంగం అంతా వీడియో తీసిన ఓ యువతి ఫేస్‌బుక్‌లో అప్‌ లోడ్‌ చేసింది. ఆ వీడియో కాస్త వైరల్‌ అయి పోలీసులకు చేరింది. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

వివరాల్లోకి వెళ్తే...  శనివారం శ్యామ్‌పుకర్‌ ప్రాంతంలో బస్సులో ప్రయాణిస్తూ.. మహిళా ప్రయాణికులను చూస్తూ యువతులను చూస్తూ అసభ్య చేష్టలకు దిగాడు. అది గమనించిన ఇద్దరు మహిళలు కండక్టర్‌తో చెప్పారు. కానీ, అతని నుంచి స్పందన లేకపోవటంతో మౌనంగా ఉండిపోయారు. ఇంతలో ఓ యువతి ఆ వ్యాపారి చేష్టలను వీడియో తీసి ఫేస్‌బుక్‌లో అప్‌ లోడ్‌ చేసింది. ఎవరూ పట్టించుకోలేదని,  ఇలాంటి వ్యవహారాల్లో ఉపేక్షించే ప్రసక్తే లేదని, అతన్ని  శనివారం సాయంత్రమే అరెస్ట్‌ చేసినట్లు కోల్‌కతా పోలీసులు ఫేస్‌బుక్‌లో తెలియజేశారు. 

loader