Asianet News TeluguAsianet News Telugu

సచిన్ వైపు దూసుకెళ్తున్న కోహ్లీ

  • వన్డే శతకాల్లో కోహ్లీ రికార్డు.
  • 30 సెంచరీలతో పాంటింగ్ సరసన.
  • ఇక మిగిలిన టార్గెట్ సచిన రికార్డే. 
Kohli run to Sachin side

 1950లో స‌ర్ డాన్ బ్రాడ్‌మెన్, 1960లో గ్యారీ సోబర్స్, 1970 లో వివి రిచ‌ర్డ్‌, 1980 లో ఇమ్రాన్ ఖాన్‌, 1990లో క‌పిల్ దేవ్  ప్ర‌పంచ క్రికెట్ బ్యాటింగ్ లో  వీరంతా ఓ సంచ‌ల‌నాలు. 2000 వ‌ర‌కు ఎలాంటి బ్యాటింగ్ రికార్డులు అయినా వారి పేరు మీదునే ఉండేవి. త‌రువాత‌ స‌చిన్ టెండుల్క‌ర్ వ‌చ్చాడు ..పై వాళ్ల రికార్డుల‌ను తిర‌గ‌రాశాడు. ఆయ‌న త‌న అద్బుత‌మైన ఆట‌శైలితో రికార్డులు మొత్తం త‌న ఖాతాలో వేసుకున్నాడు. అదే స‌మ‌యంలో స‌చిన్ కి పోటీగా రిక్కీ పాంటింగ్ దూసుకొచ్చాడు. గ‌తంలో ఉన్న స్టార్ల రికార్డుల‌ను దాటేశాడు, స‌చిన్ రికార్డులను కూడా తిర‌గ‌రాస్తున్నాడు అనుకున్నారు. కానీ అనూహ్యాంగా రిటైర్డ్ అయిపోయాడు...అయినా కూడా పాంటింగ్ వ‌న్డేలో త‌న‌దైనా ముద్ర వేశాడు. వ‌న్డేలో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన వారి జాబితాలో క్రికెట్ గాడ్ స‌చిన్ త‌రువాత పాంటింగ్ ఉన్నాడు.

 తాజాగా భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీ శ్రీలంక‌తో జ‌రిగిన ఐదో వ‌న్డేలో సెంచ‌రీ ద్వారా పాంటింగ్ స‌ర‌స‌న చేరాడు. ఆన్ ది వే టూ క్రికెట్ గాడ్‌ అంటున్నాడు.

రిక్కీ పాంటింగ్ వ‌న్డేలో 375 మ్యాచ్ లు ఆడి 30 సెంచరీలు చేశాడు. విరాట్ కోహ్లీ మాత్రం కేవ‌లం 194 మ్యాచ్‌లు ఆడి 30 సెంచ‌రీలు సాధించాడు. ఇక వ‌న్డేలో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన‌ స‌చిన్ టెండుల్క‌ర్ రికార్డునే కోహ్లీ టార్గెట్ చేశాడు. స‌చిన్ 463 మ్యాచ్‌లు ఆడి 49 సెంచ‌రీలు చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌న్డేలో ఇదే అత్య‌ధిక సెంచ‌రీల రికార్డు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు స‌చిన్ రికార్డు ద‌రిదాపుల్లోకి ప్ర‌పంచంలో ఏ బ్యాట్స్‌మెన్ రాలేదు. కానీ విరాట్ కోహ్లీ స్పీడ్ చూస్తుంటే స‌చిన్ రికార్డును చేరుకోవ‌డం అంత కష్ట‌మేమి కాదు. ప్ర‌స్తుతం కోహ్లీ వ‌య‌స్సు 28 సంవ‌త్స‌రాలు. ఆయ‌న మ‌రో 100 మ్యాచ్ లు ఆడ‌గ‌ల్గితే స‌చిన్ రికార్డును ఛేజ్ చేయ‌డం ఖాయం. 

 

మరిన్ని తాజా వార్తాల కోసం కింద క్లిక్ చేయండి...

 

Follow Us:
Download App:
  • android
  • ios