కెసిఆర్, కేశవ్ ల సమావేశం ఎఫెక్ట్

అనంతపురం జిల్లా వెంకటాపురం హెలీపాడ్ లో  తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్, అనంతపురం జిల్లా ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ సమావేశం వ్యవహారం చాాలా దూరం వెళ్లింది.

 

టిడిపి, టిఆర్ ఎస్ దగ్గరవుతాయని అంతా భావిస్తున్నారు. దీనికి రుజువుగా తెలంగాణ టడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు కూడా టిడిపి అవసరమయితే టిఆర్ ఎస్ తో, బిజెపితో కలుస్తుందిగాని, కాంగ్రెస్ తో కలవదన్నారు.

ఈ భాావం  ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలో బలంగా పాతుకుపోయింది.

కెసిఆర్, చంద్రబాబు నాయుడు చేతులు కలుపుతారని అంతా బలంగా నమ్ముతున్నారు. గ్రామస్థాయి కార్యకర్తల్లో కి కూడా ఈ సందేశం  చొచ్చుకుపోయింది. దీనికి ఉదాహరణ ఈ ప్లెక్స్ బోర్డు.

ఈ ఫ్లెక్స్ బోర్డును తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాకరంగా నిర్వహిస్తున్న ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేశారు.

ఈ బోర్డులో ఎన్టీరామారావు, చంద్రబాబు నాయుడు లతో పాటు టిఆర్ ఎస్ అధినేత కెసిఆర్ ఫోటో సమాన హోదాలో కనిపిస్తుంది.

ఇది వెలమ వారి పాలెం తెలుగుదేశం పార్టీ  ఏర్పాటుచేసిన బోర్డు ఇది. కమ్మలు, వెలమలు కలవాలని  ఈ వెలమవారి పాలెం  వారు కోరుతున్నారు.

 

ప్రకాశం జిల్లా బలికురవ మండలం వెలమవారి పాలెంకు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వస్తున్నారు. ఆయనకు స్వాగతం పలుకుతూ ఈ బోర్డు ఏర్పాటుచేశారు. బోర్డును సర్పంచ్ ను మామిళ్ల పల్లి ప్రవీణ్ కుమార్ నిలబెట్టారు.ఈ పోటో ఈ ప్రతికల్లో ప్రముఖంగా అచ్చయింది.