2017 చివరి పొలిటికల్ రూమర్?

kathi mahesh hopes to contest lok sabha election from chittoor on ycp
Highlights

కత్తి మహేశ్ కు పెద్ద ప్లానే  ఉన్నట్లుంది

 కత్తి మహేశ్... ఈ మధ్య పాపులర్ అయిన పేరు. పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ మీద ఇంతగా విరుచుకుపడిన సినిమా పర్సనాలిటీ ఎవరూ లేరు. కత్తి మీద ఆయన మీద ఒక ప్రచారం మొదలయింది. బహుశా ఇయర్ ఎండ్ టపాకాయ కావచ్చు. నిజమూ కావచ్చు. ఆయన రాజకీయాల్లోకి వస్తాడట.

పవన్ ప్రతి మాటను, ప్రతిఅడుగుని వినేవాళ్లకు విసుగొచ్చేదాకా తునాతునా తునకలు చేసి  వార్తల్లోని ప్రముఖుడయ్యాడు కత్తి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ లో చదువుకున్న మహేశ్ చిత్తూరు జిల్లాకు చెందిన వాడు. సినిమా క్రిటిక్ గా మంచి పేరు తెచ్చకున్నారు. సినిమాలతో సంబంధం ఉన్నవాళ్లు సహజంగా మరొక సినిమా ప్రముఖుడిని విమర్శించరు. అక్కడపాదాభివందనాలు పాపులర్ కల్చర్. అయితే, మహేశ్ దీనికి భిన్నంగా  పవన్ మీద కత్తి ఝళిపించాడు. అపుడపుడు ఆయన ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు మీద   మీద చురకలేశారు.  ఇలా విమర్శలు పేలుస్తూ ఉండటంతో  పేలుడు కార్యకలాపాలకు పేరుమోసిన టివిచానెళ్లకు ఆయన రెగ్యులర్ ప్రధాని అతిధి అయ్యారు. ఇక సోషల్ మీడియాలో ఆయన ఇయర్ ఎండ్ సూపర్ స్టార్ అయ్యారు.

ఈ పాపులారిటీతో ఆయన రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారట.

వచ్చే ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో లోక్ సభకో, అసెంబ్లీకో పోటీ చేయాలనుకుంటున్నారట. వైసిపి సర్కిల్స్ లో వినపడుతున్న  ఊహాగానాల ప్రకారం ఆయన వైసిపి తరఫున పోటీ చేస్తారట. అంతే కాదు, కొసమెరుపు  ఏమిటంటే జగన్ చిత్తూరు జిల్లా ప్రజాసంకల్పయాత్ర లో కత్తి వైసిపి నేతను కలసే అవకాశం కూడా ఉందట.

loader