ఎన్నికల వేళ కాంగ్రెసుకు షాక్: అంబరీష్ తో కుమారస్వామి భేటీ

Karntaka polls:Kumara Swamy meets Ambarish
Highlights

కాంగ్రెసు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి, సినీ నటుడు అంబరీష్ తో జెడిఎస్ నేత కుమారస్వామి సమావేశమయ్యారు.

బెంగళూరు: కర్ణాటక శాసనసభ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెసు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి, సినీ నటుడు అంబరీష్ తో జెడిఎస్ నేత కుమారస్వామి సమావేశమయ్యారు. శనివారం రాత్రి వారిద్దరి మధ్య భేటీ జరిగింది. 

కర్ణాటక శాససభ ఎన్నికల్లో కాంగ్రెసు టికెట్ కేటాయించినప్పటికీ అంబరీష్ పోటీకి దూరంగా ఉన్నారు. ఆయనకు కాంగ్రెసు మాండ్యా టికెట్ కేటాయించింది. అయితే ఆయన పోటీకి నిరాకరించారు. అనారోగ్య వల్ల ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పిన అంబరీష్ ఏ పార్టీకి కూడా తాను ప్రచారం చేయబోనని చెప్పారు 

రాజకీయాలకు దూరంగా ఉంటానని కూడా చెప్పారు. అయితే, కుమారస్వామితో ఆయన భేటీ కావడం ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. అంబరీష్ సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెసు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అయితే, ఆయనను 2016లో మంత్రి పదవి నుంచి తొలగించారు. దాంతో ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. 

అయితే, మాండ్యా నుంచి పోటీ చేయాలంటూ కాంగ్రెసు ఆయన భీ ఫారం ఇచ్ిచంది. అయితే, ఆయన అందుకు నిరాకరించారు. నామినేషన్ల దాఖలుకు గడువు సమీపించడంతో ఏ విషయమూ చెప్పాలని పార్టీ నాయకత్వం అడిగింది. అయితే తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. తాజా పరిణామం నేపథ్యంలో అంబరీష్ జెడిఎస్ లో చేరుతారా అనే ప్రశ్న ఉదయిస్తోంది.

loader