Asianet News TeluguAsianet News Telugu

బాలీవుడ్ క్వీన్ కి ముఖంపై గాయాలు 15 కుట్లు.

  • మణికర్ణిక షూటింగ్ లో కంగనాకు గాయాలు
  • ముఖంపై 15 కుట్లు
  • ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పిన డాక్టర్లు.
Kangana ranout had injury in manikarnika shooting 15 striches

కంగానా ర‌నౌత్ కి షూటింగ్ లో గాయాలు అయ్యాయి. తెలుగు డైరెక్ట‌ర్ క్రిష్ డైరెక్ట్ చేస్తున్న సినిమా మణికర్ణిక, ది క్వీన్ ఆఫ్ జాన్సీ రాణీ సినిమా షూటింగ్‌లో భాగంగా ఆమెకు ముఖంగా గాయాలు అయ్యాయి. జాన్సీ రాణీ పై సినిమాను  నిర్మిస్తున్న విష‌యం తెలిస్తుంది. అందులో భారీ యాక్ష‌న్ ఘ‌టాలు ఉన్నాయ‌ట‌. వాటిని రామోజీ ఫిల్మ్‌సిటీలో గ‌త వారం రోజుల‌గా షూట్ చేస్తున్నారు. అయితే నేడు ఉద‌యం షూటింగ్‌లో భాగంగా యుద్ద స‌న్నివేశాల‌ను షూట్ చేస్తున్నాడు డైరెక్ట‌ర్ క్రిష్. సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న‌ న‌టుడు నిహార్ పాండ్య‌తో ఫైట్ సీన్ జ‌రుగుతుండ‌గా కంగానా త‌న క‌త్తితో నిహార్ పాండ్య క‌త్తిని ఆపాలి. కానీ కంగానా అనుకున్న స‌మ‌యంలో స్పందిక‌పోడంతో క‌త్తి ముఖం పై కోసుకుంది. 


దీంతో కంగానా ర‌నౌత్ ముఖం పైగా ఎక్కువ‌గా గాయం అయింది. త‌క్ష‌ణ‌మే ఆమెను ఫిల్మ్ సిటీ నుండి అపోలో హాస్పిట‌ల్ కి త‌ర‌లించారు. అక్క‌డ ఆమె ముఖానికి స‌ర్జరీ చేశారు. ఆమెకు ముఖం పై 15 కుట్లు ప‌డ్డాయి. ప్ర‌స్తుతం ఆమెకు ఎలాంటి ప్ర‌మాదం లేద‌ని. కంగానా ర‌నౌత్ ని ఐసీయూ లో ఉంచామని. త‌ను కోలుకుంటారని. మ‌రో వారం రోజుల పాటు ప‌రిశీల‌న‌లో ఉంచుతామ‌ని పెర్కోన్నారు. 


షూటింగ్ మ‌ధ్య‌లో ఇలా జ‌ర‌గ‌డం షూటింగ్ ని ఆపేశారు. మ‌రో వారంలో కంగానా కోలుకుంటుద‌ని, వ‌చ్చే వారం ఆమె షూటింగ్ లో పాల్గోంటార‌ని జాన్సీ రాణీ టీం తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios