కడప జిల్లా మన్నూర్ ఎస్సై భార్య ఆత్మహత్య

kadapa district mannuru si wife suicide
Highlights

ఒక ఎస్సై భార్య ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు పోగొట్టుకున్న విషాద సంఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలో మన్నూరు పోలీస్ స్టేషన్ లో ఎస్సై గా పనిచేస్తున్న మహేష్ నాయుడు భార్య సౌజన్య ఫ్యాన్ కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. వీరి కొడుకు వైద్యం విషయంలో భార్య, భర్తల మధ్య ఏర్పడిన  విభేదాల కారణంగానే క్షణికావేశంలో ఆమె ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని  భావిస్తున్నట్లు రాజంపేట డీఎస్పీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా కాళహస్తికి చెందిన  మహేష్‌నాయుడికి కావలికి చెందిన సౌజన్యతో 2013 లో పెళ్లయింది. మహేష్ కడప జిల్లా రాజంపేట్ సమీపంలోని మన్నూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేస్తున్నాడు. దీంతో భార్యాభర్తలు రాజంపేటలో కాపురం పెట్టారు. అయితే వీరికి పూర్ణేష్ అనే కొడుకు ఉన్నాడు. ఈ బాబు పుట్టు మూగ. తమ బిడ్డకు మాటలు రావడానికి భార్యా భర్తలు అనేక ఆస్పత్రులకు తిరిగినా ఫలితం లేకుండాి పోయింది. అయితే కొడుకు వైద్యం విషయంలో భార్య భర్తలకు ఈ మద్య కాలంలో విభేదాలు తలెత్తాయి. దీంతో మనస్థాపానికి గురైన సౌజన్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ విషయంపై సమాచారం అందుకున్న రాజంపేట డీఎస్పీ లక్ష్మీనారాయణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కొడుకు పూర్ణేష్‌కు వైద్యం విషయంలో మనస్థాపానికి గురై క్షణికావేశానికిలోనై సౌజన్య ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చనని తమ ప్రాథమిక విచారణలో తెలినట్లు డీఎస్పీ తెలిపారు.ఈ ఘటనపై పూర్తి వివరాలు వారి బంధువులు, కుటుంబ సభ్యుల ద్వారా సేకరించి త్వరలో వెల్లడిస్తామని లక్ష్మీనారాయణ తెలిపారు.
 
loader