మరో రెండు కొత్త ప్లాన్లను ప్రవేశపెట్టిన జియో

ప్రముఖ టెలికాం సంస్థ వినియోగదారుల కోసం ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తోంది. నూతన సంవత్సర కానుకగా మరో రెండు కొత్త ప్లాన్లను తీసుకొచ్చింది. రూ.199, రూ.299 మొత్తాలపై తీసుకొచ్చిన ఈ రెండు ప్లాన్లు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. రూ.199 ప్లాన్‌ కింద 28 రోజుల కాలపరిమితిపై రోజుకు 1.2జీబీ హైస్పీడ్‌ డేటాతో పాటు అపరిమిత కాల్స్‌, అపరిమిత ఎస్సెమ్మెస్‌లు, జియో యాప్స్‌ లభిస్తాయి. ప్రైమ్‌ మెంబర్స్‌ కు ఈ సదుపాయాలు వర్తిస్తాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఎక్కువ డేటా ఉపయోగించే వారి కోసం రూ.299 ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీని కింద 28 రోజులకు రోజుకు 2జీబీ డేటాతో పాటు అపరిమిత కాల్స్‌, అపరిమిత ఎస్సెమ్మెస్‌లు, జియో యాప్స్‌ ను ప్రైమ్‌ మెంబర్లు ఉపయోగించుకోవచ్చని కంపెనీ పేర్కొంది.