ఇక 3 జీ ఫోన్ లలోనూ జియో సౌకర్యంకొత్త సంవత్సరంలో రిలయన్స్ బంపర్ ఆఫర్

రిలయన్స్ జియో ఆఫర్ దేశ టెలికం రంగంలోనే ఓ సంచలనం. ఫ్రీ కాల్స్‌, డేటా సౌకర్యంతో

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

పోటీదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. క్యూలు కట్టి మరీ జియో సిమ్ లు తీసుకున్నారు.

ఇప్పుడు మరో సంచలన ప్రకటనతో వినియోగదారులకు జియో బంపర్ ఆఫర్ ఇచ్చింది.

అదేంటంటే... జియో ఇకపై 3జీ ఫోన్లలోనూ పనిచేయనున్నట్లు రిలయన్స్ ప్రకటించింది.

ఇప్పటి వరకు 4జీ ఫోన్లలో మాత్రమే జియో సిమ్‌లు పనిచేస్తున్న విషయం తెలిసిందే.

ఇకపై 3జీ ఫోన్లలోనూ పనిచేసే విధంగా సరికొత్త యాప్‌ను తయారు చేస్తోంది.


‘హ్యాపీ న్యూఇయర్‌ ఆఫర్‌’ కింద 3జీ ని తీసుకురానున్నట్లు రిలయన్స్ ప్రకటించింది.

సుమారు 5.2 కోట్లమంది జియో సిమ్ ను ప్రస్తుతం వాడుతున్నట్లు సంస్థ ప్రకటించింది.