సౌదీ అరేబియా లోని దమ్మంనుంచి కేరళ లోని కొచ్చికి వస్తున్న తమ విమానంలో పుట్టిన ఓ బాలునికి జెట్ ఎయిర్‌వేస్ సంస్థ ఒక అరుదయిన కాన్క అందించింది

సౌదీ అరేబియా లోని దమ్మంనుంచి కేరళ లోని కొచ్చికి వస్తున్న తమ విమానంలో పుట్టిన ఓ బాలునికి జెట్ ఎయిర్‌వేస్ సంస్థ జీవిత కాల ఉచిత ప్రయాణ పాస్ అందించింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

‘‘ మా విమానంలో ఒక శిశువు జన్మించడం ఇదే కావడంతో, జెయిట్ఎయిర్ వేస్ విమానాలలో జీవితాంతం ఉచితంగా ప్రయాణం చేసే పాస్ అందిస్తున్నాం,’’ జెట్ ఎయిర్ వేస్ తెలిపింది.

నిన్న విమానం ఇంకా అరేబియా సముద్రం మీద ఎగురుతుండగనే శిశువు తల్లికి పురిటినొప్పులు మొదలయ్యాయి.

ఫలితంగా ఫ్లయిట్ 9డబ్ల్యు 569ను అత్యవసరంగా ప్రసవం కోసం ముంబాయికి మళ్లించాల్సి వచ్చింది. తల్లిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు పురుడుపోశారు. మగశిశువు జన్మించాడు. విమానంలో నే ప్రయాణిస్తున్న కేరళ నర్సు ప్రసవానికి సహకరించింది.