క్రిటికల్ కేర్ లో ఉన్న రోగుల గదుల్లో సీసీటీవీ కెమెరాలు ఉండవు. ఈ దశలోని రోగుల చికిత్సని సిసి కెమెరాలతో రికార్డు చేయడం సరికాదు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అపోలో అసుపత్రిల వైద్యం చేసినందుకు అయిన ఖర్చు రు. 5.5 కోట్లు.
జయలలిత మరణంపై వ్యక్తమయిన అనుమానాలను నివృత్తి చేసేందుకు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అపోలో డాక్టర్లు ఈ విషయం వెల్లడించారు.
ఆమెకు వైద్యం చేసిన లండన్ డాక్టర్ రిచర్డ్ జాన్ బీయ (Richard John Beale) ఈ రోజు విలేకరులతో మాట్లాడారు.
జయలలితకు అత్యుత్తమ వైద్యం అందివ్వడం జరిగిందని అంటూ చాలా క్లిష్ట పరిస్థితులలో జయలలితను ఆస్పత్రికి తీసుకొచ్చారని ఆయన చెప్పారు.
జయ కాళ్లు తొలగించినట్టుగా వచ్చిన వార్తలు తప్పని డాక్ట బీయ చెప్పారు. ‘ఆమెకు సంబంధించిన ఏ శరీర అవయవాన్ని తొలగించడం గానీ, ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా అవయవ మార్పిడి చేయడం గానీ జరగలేదు. ఆమె ఆస్పత్రిలో చేరినప్పుడు కనీసం మాట్లాడలేకపోయారనీ... కొద్దిమేర చికిత్స అందించిన తర్వాత స్పృహలోకి వచ్చి మాట్లాడడం మొదలుపెట్టారు,’ అని ఆయన వివరించారు.
’ఆమెను ఆస్పత్రికి తీసుకొచ్చేటప్పటికీ బాగా ఇన్ఫెక్షన్ ఉంది. ఇన్ఫెక్షన్ తో జయలలిత శరీరంలోని అవయావాలన్నీ దెబ్బతిన్నాయి. అప్పటికే ఆమెకు మధుమేహం ఎక్కువగా ఉండింది. ఉప ఎన్నికల సమయంలో ఈసీ నిబంధనలను ఆమెకు చదివి వినిపించామని, అన్ని విన్నాకే బీఫామ్ లపై జయ సంతకాలు చేశారు,‘ అని డాక్టర్లు తెలిపారు.సెప్టెంబర్ 22 నుంచి 29 దాకా ఆమె వెంటిలేటర్ మీద ఉన్నారు. జయలలితకు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. గుండెపోటు ఎపుడో వస్తుందో వూహించలేం. గుండె పోటు రావడంతో ఆమె మరణించారు. క్రిటికల్ కేర్ లో ఉన్న రోగులు ఉంటున్న గదుల్లో సీసీటీవీ కెమెరాలు ఉండవని, ఈ దశలోని రోగులను సిసి కెమెరాలో రికార్డు చేయడం సరికాదని డాక్టర్ రిచర్డ్ బీలే చెప్పారు. చివరి నిమిషం దాకా అమె మాట్లాడుతూనే ఉన్నారని కూడా ఆయన వెల్లడించారు.
అమె వైద్యం, ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు శశికళకు, ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీకి చెబుతూ నే ఉన్నారని కూడా ఆయన వెల్లడించారు.
