జనసేన మంచినీళ్లొచ్చాయి

First Published 8, Jul 2017, 12:59 PM IST
janasena supplies drinking water to people in Nellore district
Highlights

పవన్ నేతృత్వంలోని జనసేన ప్రజలకు తోడుండేందుకు నడుం బిగించింది. జనసైనికులు ప్రజలు కష్టాలు తెలుసుకుని తీర్చేందుకు కృషి మొదలుపెట్టారు.  ఈ రోజు నెల్లూరు జిల్లా నాయుడుపేట రాజగోపాలపురంలో  మంచినీళ్ల కోసం ప్రజల కటకటలాడుతున్నారనే సమాచారం జనసేన పార్టీకి అందింది.అంతే, జనసేన మంచినీళ్లొచ్చాయి. అధికారులు చేయలేని పని అరగంటలో జనసైనికులు చేసేసి ప్రశంసలందుకున్నారు.

 

పవన్ నేతృత్వంలోని జనసేన ప్రజలకు తోడుండేందుకు నడుం బిగించింది.జనసైనికుల ప్రజలు కష్టాలు తెలుసుకుని తీర్చేందుకు కృషి మొదలుపెట్టారు.  ఈ రోజు నెల్లూరు జిల్లా నాయుడుపేట రాజగోపాలపురంలో  మంచినీళ్ల కోసం ప్రజల కటకటలాడుతున్నారనే సమాచారం జనసేన పార్టీకి అందింది.

 

వర్షం వల్ల వీధిలో మురుగు నీరు నిల్వ ఉండిపోయి తాగునీరు సైతం కలుషితమైపోయింది ఈ ప్రాంతంలో.  వెంటనే  నీటి కష్టాలు తీర్చేందుకు జనసైనికులు ముందుకు వచ్చారు. ఈ పరిస్థితి తెలుసుకున్న జనసేన సేవా దళ్‌ నీటి ట్యాకర్లతో రాజగోపాలపురం ప్రజల వద్దకు వెళ్లింది.

 

దీనితో  ఈ ప్రాంతమంతా జనసేన మంచినీళ్లొచ్చాయని ఒక సందడి. 

 

ఈ కార్యక్రమంలో జనసేన సేవా దళ్‌ నాయుడుపేట సభ్యులు యాసిన్‌ షేక్‌, గిండి సతీష్‌ కుమార్‌, లీలామోహన్‌, యష్వంత్‌ పాల్గొని ప్రజలకు నీరందించారు.

 

ప్రజల ఇక్కట్లు తీర్చేందుకు తాము చేయగలిగిందంతా చేస్తామని సేవాదళ్  నేతలు ఏషియానెట్  ప్రతినిధికి తెలిపారు.

 

loader