చిన్న కాకాని దగ్గిర జనసేన హెడ్ క్వార్టర్స్ నిర్మాణం? (బ్రేకింగ్ )

First Published 23, Nov 2017, 11:51 AM IST
Janasena headquarters to come up near chinna Kakani in Andhra
Highlights

సకల హంగులతో జనసేన హెడ్ క్వార్టర్స్  నిర్మాణానికి ఏర్పాట్లు

జనసేన పార్టీకి ప్రధాన కార్యాలయం నిర్మించేందుకు అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏర్పాట్లు మొదలుపెట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇది రాజధాని అమరావతి సమీపంలోని మంగళగిరి మండలం చిన్నకాకాని   వద్ద  ఏర్పాటవుతున్నట్లు తెలిసింది.  జనసేన పార్టీ ప్రధానకార్యాలయం నిర్మాణం కోసం చినకాకాని గ్రామ జాతీయ రహదారి సమీపంలో  స్థలం ఎంపిక జరిగిందని స్థానిక నేత ఒకరు ఏషియానెట్ కు చెప్పారు. ప్రధాన కార్యాలయం సర్వ హంగులతో నిర్మించేందుకు   మూడున్నర ఎకరాల భూమిని చిన్న కాకాని గ్రామ  రైతుల దగ్గర లీజుకు తీసుకున్నారని ఆయన చెప్పారు. పార్టీ నాయకులకు ఈ   రైతులకు నిన్న అగ్రిమెంటు జరిగిందని వారు చెప్పారు. అయితే, జనసేన నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
 
 

loader