వైసీపీ తొలి అభ్యర్థి ఎవరో తెలుసా?

First Published 25, Nov 2017, 5:43 PM IST
jagan announced first member of his party as sridevi over 2019 elections
Highlights
  • పార్టీ తొలి అభ్యర్థిని ప్రకటించిన జగన్
  • పత్తికొండ నియోజకవర్గ అభ్యర్థిగా శ్రీదేవి

వైసీపీ  తొలి అభ్యర్థి ని జగన్ ప్రకటించారు. 2019 ఎన్నికలు మరెంతో దూరంలేవన్న సంగతి తెలిసిందే. కాగా.. ప్రజాసంకల్పయాత్రలో ఉన్న జగన్ తొలిసారిగా పాదయాత్రలో పార్టీ అభ్యర్థిని ప్రకటించారు. పత్తికొండ నియోజకవర్గానికి తమ పార్టీ  అభ్యర్థిగా చెరుకులపాడు శ్రీదేవి పేరును అధికారికంగా ప్రకటించారు. గతంలో పత్తికొండ నియోజకవర్గానికి వైసీపీ ఇంఛార్జిగా ఉన్న చెరుకులపాడు నారాయణ రెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అతని భార్యే ఈ శ్రీదేవి.

నారాయణ రెడ్డి అంత్యక్రియలకు వచ్చిన సమయంలోనే 2019 ఎన్నికల్లో తమ పార్టీ నుంచి సీటు ఇస్తానని జగన్ శ్రీదేవికి హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఆయన శుక్రవారం పార్టీ అభ్యర్థిగా మరోసారి ప్రకటించారు. ఆమెను అభ్యర్థిగా నియమించడానికి పార్టీలో ఎటువంటి అభ్యంతరాలు లేకపోవడం, భర్త చనిపోయిన సింపతీ ఉండటంతో ఆమె అభ్యర్థిత్వం ఖరారైంది.

loader