ఇస్రో-104కు కౌంట్ డౌన్ మొదలు

Isro begins countdown for Historic launch of 104 satellites
Highlights

28 గంటల కౌంట్ డౌన్ ప్రారంభం

రేపు జరగబోతున్న ఇస్రో చారిత్రాత్మక ప్రయోగానికి 28 గంటల కౌంట్ డౌన్ మొదలయింది. 104 ఉపగ్రహాలను ఒకే ప్రయోగంలో శ్రీహరి కోట షార్ కేంద్రంనుంచి ఇస్రో ప్రయోగించనుంది.

 

 పిఎస్ ఎల్ వి-37/కార్టో శాట్ 2 సీరీస్ మిషన్ గా జరగే ఈ ప్రయోగానికి మంగళవారం ఉదయం 5.28గం. కౌంట్ డౌన్ మొదలయింది.  మిషన్ రెడీనెస్ కమిటీ, లాంచ్ ఆథరైజేషన్ బోర్డు అనుమతి నీయగానే కౌంట్ డౌన్ ప్రారంభించారు.. రేపు ఉదయం 9గంటల 28 నిముషాలకు లాంచింగ్ జరుగుతుంది.

 

వెంటనే శాస్త్రవేత్తలు రాకెట్లలో ఇందనం నింపడంమొదలుపెట్టారు. ఇది పిఎస్ ఎల్ వి కి 39వ అంతరిక్ష యాత్ర. పిఎస్ ఎల్ వి మొదట 714కెజిల CARTOSAT-2  సీరీస్ ఉపగ్రహాన్ని కక్ష్య లో ప్రవేశపెడుతుంది. తర్వాత 103 ప్యాసెంజర్ శటిలైట్లను భూమికి 520 కి.మీ ఎత్తున సన్ సింక్రోనస్ అర్బిట్లో ప్రవేశపెడుతుంది.  వీటన్నింటి మొత్తం బరువు 664 కెజిలు. 

 

ఈ ప్రయోగంలో ఇస్రో శాస్త్రవేత్తలు చాలా శక్తి వంతమయిన XL రకం రాకెట్ ను వాడుతున్నారు.గతంలో  దీనినే చంద్రయాన్,  మార్స్ ఆర్బిట్ మిషన్ లలో కూడా వాడారు. ఇపుడు ప్రయోగిస్తున్న ప్యాసెంజర్ ఉపగ్రహాలలో 96 అమెరికాకు చెందినవి. మరొక అయిదు ఇస్రో ఇంటర్నేషన్ కస్టమర్లయిన ఇజ్రేల్, కజకిస్తాన్, నెదర్లాండ్స్,స్విజర్లాండ్, యునైటెడ్ అరబ్  ఎమిరేట్స్ తదితర దేశాలకు చెందినవి. ఇవికాకుండా, 1378 కేజీలున్న రెండు భారతీయ నానో ఉపగ్రహాలను కూడా పిఎస్ఎల్ వి ప్రయోగిస్తుంది.

 

TODAY'S POLL

బిత్తిరి సత్తి శ్రీ ముఖిపై అతిగా కామెంట్ చేశాడా?

loader