Asianet News TeluguAsianet News Telugu

టిడిపి వదిలేస్తా... మీళ్లీ బెదిరిస్తున్న శిల్పా

శిల్పాను పార్టీ లో చేర్చుకుంటే, పార్టీకోసం పని చేసిన రాజగోపాల్ రెడ్డి ( ఎంపి ఎస్ పివై రెడ్డి అల్లుడు) లాంటి వారి సంగతేమిటి?  ఈ మధ్యనే రాజగోపాల్ రెడ్డి వైసిపి ప్లీనరీని కూడా విజయవంతంగా నిర్వహించారు. ఆ మధ్య గంగుల ప్రతాప్ రెడ్డి పేరు కూడా వినబడింది. ఇలాంటపుడు ఇంతగా, బహిరంగంగా అవకాశం వాదం ప్రదర్శించిన శిల్పా మోహన్ రెడ్డిని పార్టీలోకి తీసుకుని, టికెట్ ఇవ్వడం  ప్రమాదకరమని అని వైసిసి స్థానికులు అంటున్నారు.

Is Silpa Mohan Reddy welcome in YCP

టిడిపి కర్నూల్  జిల్లా నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి  పార్టీని వదిలేయడం గ్యారంటీ అంటున్నారు. తెలుగు దేశం పార్టీలో ఉండాలా వద్దా అనే దాని  రెండు నెలలుగా తర్జనభర్జనలు, బేరా సారాలు జరిపి,చివరకు టిడిపి వదిలేయడమే మంచిదని నిర్ణయానికి వచ్చినట్లు ఆయన సన్నహితులొకరు ఏషియానెట్ కు తెలిపారు.

‘ఈ రోజు అన్న కార్యకర్తల సమావేశం ఏర్పాటుచేస్తున్నారు. అక్కడ కార్యకర్తల, అభిమానుల అభిప్రాయం తీసుకునితన నిర్ణయం ప్రకటించబోతున్నారు,’ అని ఆయన చెప్పారు.

ఆ మధ్య ముఖ్యమంత్రిని కలసి వచ్చాక నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక టికెట్ మీద నమ్మకం వ్యక్తం చేస్తూ, ఇక పార్టీలోనే ఉండాలనుకున్నారు. దానికి తోడు ముఖ్యమంత్రి కూడా,  తెలివిగా,  టికెట్ ఎవరికన్నది పార్టీ నిర్ణయిస్తుందని, ఆవిషయంలో ఎలాంటి ప్రకటనలు చేయవద్దని మంత్రి  అఖిల ప్రియకు సలహా ఇవ్వడంతో శిల్పాకు తన లో టికెట్ రావచ్చనే నమ్మకం ముదిరింది. దీనితో ఆయన పార్టీ ఫిరాయించి, వైసిపిలో చేరాలనుకున్న నిర్ణయం మానుకున్నారు.

అయితే, ముఖ్యమంత్రి వద్దని వారించినా అఖలి ప్రియ తన అభ్యర్థిని రంగంలోకి దించడం మానలేదు. తన పెద్ద నాయన కుమారుడే అభ్యర్థిఅనడం, ఆయన కూడా నంద్యాల నియోజకవర్గంలో కాంపెయిన్  మొదలుపెట్టడం జరిగింది. ఇంత జరగుతున్నా, ముఖ్యమంత్రి ఆమెను వారించకపోవడం వల్ల చంద్రబాబు నిజాయితీ మీద మరొక సారి శిల్పాకు అనుమానం వచ్చినట్లుంది. అందుకే భూమాకుటంబానికి ఉన్న ప్రాముఖ్యం తనకు లేదని తెలిసి ఇపుడు ఆయన కార్యకర్తల సమావేశం ఏర్పాటుచేశారు.

టిడిపికి గుడ్ బై కొట్టి ఆయన మళ్లీ జగన్ ను ఆశ్రయిస్తాడని చెబుతున్నారు.

అయితే, ఇాంతగా వూగిసలాడి, కేవలం టికెట్ కోసం పార్టీని మార్చాలనుకునేవాడిని జగన్ ఎలా పార్టీలోకి తీసుకుంటాడనేది ప్రశ్న.

ఇపుడు శిల్పాను పార్టీ లో చేర్చుకుంటే, పార్టీకోసం పని చేసిన రాజగోపాల్ రెడ్డి ( ఎంపి ఎస్ పివై రెడ్డి అల్లుడు) లాంటి వారి సంగతేమిటి?  ఈ మధ్యనే రాజగోపాల్ రెడ్డి వైసిపి ప్లీనరీని కూడా విజయవంతంగా నిర్వహించారు. ఆ మధ్య గంగుల ప్రతాప్ రెడ్డి పేరు కూడా వినబడింది. ఇలాంటపుడు ఇంతగా, బహిరంగంగా అవకాశం వాదం ప్రదర్శించిన శిల్పా మోహన్ రెడ్డిని పార్టీలోకి తీసుకుని,టికెట్ ఇస్తే,  ప్రమాదం అని వైసిసి స్థానికులు అంటున్నారు.

ఇలా టికెట్ కోసమే పార్టీ మారాడని, శిల్పా పచ్చి అవకాశవాది అని టిడిపి క్యాంపెయిన్ చేస్తుంది.

దీనికి తోడు, తమ్ముడు శిల్పా చక్రపాణి రెడ్డి కౌన్సిల్ ఛెయిర్మన్ పదవి హామీ ఉంది. అంటే, శిల్పామోహన్ రెడ్డి పార్టీ మారి వైసిపిలో చేరినా కుటుంబం నుంచి ఆయనకు పూర్తి మద్దతు రాదు.

ఇలాంటపుడు, పార్టీకి శిల్పా బరువై పోతాడు గాని, పరువేం పెంచడు.

కాబట్టి జగన్ శిల్పా విషయంలో ఆచితూచి అడుగేయాలని చాలా మంది పార్టీనాయకులు కోరుకుంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios