Asianet News TeluguAsianet News Telugu

(వీడియో) పన్నీర్ రాజీనామా వెనక తెలుగోడు...?

ఒక తెలుగు కాంట్రాక్టర్ కు సంబంధించిన ఫైల్ మీద సంతకం చేయకపోవడమే పన్నీర్ రాజీనామా కు దారితీసిందని ఎఐఎడిఎంకె నాయకురాలు గీత చెబుతున్నారు

Is Sekhar Reddy behind sudden quitting of Panneerselvam

తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం రాజీనామా వెనుక వివాదాస్పద  తెలుగు కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి హస్తముందా?

 

అవుననే అంటున్నాయి ఏఐఏడిఎంకె వర్గాలు.  వందల కోట్ల కాంట్రాక్ట్ కు సంబంధించిన ఓ ఫైలుపై అనుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా సిఎంతో పాటు ప్రభుత్వ సలహాదారు షీలా బాలకృష్ణన్ ల మీద శశికళ వత్తిడి తీసుకువచ్చినట్లు పార్టీ సీనియర్ నేత కెఎస్ గీత వెల్లడించారు.

 

అయితే, సదరు ఫైల్ పై సంతకాలు చేయటానికి ఇద్దరూ తిరస్కరించారు. ఇంతకీ సదరు ఫైల్ వివాదాస్పద కాంట్రాక్టర్, పెద్ద నోట్ల రద్దు సమయంలో ఐటి దాడుల్లో పట్టుబడ్డ శేఖర్ రెడ్డికి సంబంధించిన ఫైలని గీత చాలా స్పష్టంగా చెప్పారు.

 

ఇండియా టు డే  చానెల్ తో మాట్లాడుతూ గీత  ఈ విషయాలను వెల్లడించారు.

శేఖర్ రెడ్డి టిటిడి బోర్డు మెంబర్ గా ఉండిన విషయం తెలిసిందే. అయితే, ఇన్ కమ్ టాక్స్ దాడులలో గుట్టలు గుట్టలు కొత్త నోట్లు దొరికాక  ఆయనకు సెలెబ్రెటి స్టేటస్ వచ్చింది. తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగం నుంచి పెరికేసి చేతులు దులుపుకున్నారు.

 

శేఖర్ రెడ్డికి అనుకూలంగా శశికళ, వ్యతిరేకంగా పన్నీర్, షీలాలు నిలబడినట్లు ఈ వ్యవహారం వల్ల అర్థమవుతుంది.

 

   ఫైలుపై సంతకం పెట్టేది లేదని పన్నీర్, షీలా మెరాయించడంతో ఒళ్ళుమండిన శశికళ ఇద్దరూ రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చారని గీత చెబుతున్నారు. దాంతో పన్నర్ తో పాటు షీలా కూడా హఠాత్తుగా రాజీనామాలు సమర్పించినట్లు గీత ఆరోపించారు.

 

 శేఖర్ రెడ్డి దశాబ్దాలుగా శశికళ కుటుంబానికి బాగా సన్నిహితుడు. కేవలం శేఖర్ రెడ్డికి లబ్ది చేకూర్చేందుకే శశికళ దంపతులు పన్నీర్ పై ఒత్తిడి తెచ్చినట్లు కెఎస్ గీత చెప్పటం సంచలనం సృష్టిస్తున్నది.

 

జయలలితకు బాగా నమ్మకస్తులుగా పేరున్న పన్నీర్ తో పాటు షీలాను కూడా ప్రభుత్వ వ్యవహారాలకు దూరంగా ఉంచేందుకే శశికళ దంపతులు భారీ స్కెచ్ వేసినట్లు అర్ధమవుతోంది.

 

గతంలో ప్రభుత్వంలో పనిచేసిన నటరాజన్ కు పాలనా వ్యవహరాలు తెలుసని , ముఖ్యమంత్రి పన్నీర్, సలహాదారు షీలా ఇద్దరూ రాజీనామా చేసినంత మాత్రన ప్రభుత్వానికి వచ్చే నష్టమేదీ లేదనే ధోరణితో శశికళ ఉన్నట్లు గీత వెల్లడించారు.

 

జయకు బాగా నమ్మకస్తులైన వారందిరినీ ప్రభుత్వంలో నుండి పంపేసి తన మనుషులతో నింపటం ద్వారా తమ ఇష్టమొచ్చినట్లు పాలన సాగించవచ్చని శశికళ యోచిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలకు కెఎస్ గీత చేసిన ఆరోపణలు మద్దతుగా నిలుస్తున్నాయి.

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios