ధోని పనై పోయిందా???

First Published 25, Nov 2017, 6:21 PM IST
is it end of the road for ms dhoni
Highlights

ధోనీనే ఇపుడు ఇంతగావిమర్శిస్తున్నవారు, గతంలో 60 వోవర్లు ఆడి 36 పరుగులు మాత్రమే చేసిన గవాస్కర్ గురించి ఏమ్మాట్లాడేవారో...

ధనా ధన్ "ధోని"  మొన్న రాజ్ కోట్ లొ న్యుజిల్యాండ్ జరిగిన రెండో టీ-ట్వెంటీ  మ్యాచ్ లో నత్త నడకన చేసిన బ్యాటింగ్ వల్ల కొంత విమర్షకు గురయ్యడు. అదీ లక్ష్మణ్ , అగార్కర్ వంటి ప్రముఖ  క్రికెటర్ల విమర్షించటం (ఇంకా ఇతరులు కూడా ఉన్నారు) ప్రస్తుతం చర్చనీయంశం అయ్యింది. అయిత్ కెప్టెన్  కోహ్లీ మత్రం మాజీ కెప్టెన్ ను వెనకేసుకు రావటంతో అసలు చిన్న సమస్య కొంత పెద్దదయ్యింది. గతం లో డాషింగ్ క్రికెటర్లు కొంతమంది (ముఖ్యంగా యువరాజ్ సింగ్)  నెమ్మదిగా ఆడినప్పుడు తప్పుకోవాలని సలహా ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు మౌనంగా ఎందుకున్నారని ఆ ముగ్గురు ప్రశ్నిస్తున్నారు.

ప్రముఖ బ్యాట్స్ మన్ లక్ష్మణ్ ' ధోని తప్పుకుని యువకులకు అవకాశం ఇవ్వాలి' అని చెప్పగా, అగార్కర్ మాత్రం "ధోని తప్పుకుంటే మరో పేస్ బౌలర్ కు అవకాశం వస్తుంది కదా?" అని అభిప్రాయ పడ్డాడు.

ఇంతా చేస్తే రాజ్ కోట్ లో ధోని 39 బాల్స్ ఆడి 47 పరుగులు మాత్రమే(?) చెయ్యటం! గతం లో చెలరేగి ఆడిన ధొని  ఇన్నింగ్స్ తో పోలిస్తే ఇది కాస్త నెమ్మదైనదే. అయితే అదొక్కటే ధొనిని విమర్శించటనికి కారణం కాదని ధొని సమర్థకులు  భావిస్తున్నారు. గతం లో ధొని కెప్టెన్ గా ఉన్నప్పుడు ముగ్గురు సీనియర్ క్రికెటర్లను భరత జట్టులో నుంచి తీసేయలని కోరుకున్నాడు.ఇప్పుడు వాళ్ళే ధొనీని తప్పుకోవాలంది చెప్తున్నారు. అప్పుడు తమకు వర్తించిన సూత్రం ధోనికి వర్తించదా అని అడుగుతున్నారు. వాళ్ళది పగ తీర్చుకునే మనస్తత్వం అని అభిమానుల అభిప్రాయం.

గతం లో రెండు మ్యాచ్ ల తర్వాత ఒక సీనియర్ క్రికెటర్ ను ధోని తప్పుకోమని అడిగాడు. అయితే ఆ క్రికెటర్ " ఒకవేళ నేను సెంచురీ చేస్తే?" అని చెప్పగా, "సమస్య నీ బ్యాటింగ్ కాదు. నీ ఫీల్డింగ్ బాలేదు. పైగా నువ్వు వికెట్ల మధ్య నెమ్మదిగా పరిగెత్తుతున్నావు" అని ధోనీ చెప్పాడన్నది ఒక వార్త. అలాగే మరో సీనియర్ ను కూడా అదే కారణం తో తప్పుకోమన్నాడట. ఇంకో సీనియర్ ఇప్పటి వేగానికి సరిపోడని ధోని అభిప్రాయ పడ్డాడన్నది ఇంకో వార్త.

ధోనీకి ఇప్పుడు 36 ఏళ్ళు. యువరాజ్ సింగ్, లక్ష్మణ్, గంగూలి 36 ఏళ్ళ వయసులో ధోనీ అంత ధృడంగా లేరు. పైగా ఈ వయసులో కూడా ధోనీ ఫిట్ వికెట్ కీపర్. ఇంకో నాలుగేళ్ళు ఆడగలడు. అంతే కాకుండా కోహ్లీ కి ఒక మిష్టర్ కూల్ వికెట్ కీపర్ కం ప్లానర్ టీం  కు బోనస్. కేవలం తమను తీసేశాడన్న అక్కసుతో నే ఆ ముగ్గురు ధోని ని విమర్శిస్తున్నారన్నది ఒక వాదన. ఏది ఏమైనా ధోని ఇంకా కొంత కాలం ఆడగలడన్నది ఎవ్వరికి తెలిసినా తెలియక పోయినా ,ధోనీ కు తెలుసు.

ధోనీ ఎప్పుడు ఎప్పుడు రిటైర్ కావాలన్నది అతనికే వదిలెయ్యాలని కొంత మంది క్రికెటర్లు అంటున్నారు.

కొసమెరుపు ఏమిటంటే .. రాజ్ కోట్ మ్యాచ్ లో కోహ్లీ తర్వాత 40 పరుగులతో సెకండ్ బెస్ట్ స్కోర్ చేసింది ధోనీనే!

ధోనీనే ఇపుడు ఇంతగావిమర్శిస్తున్నవారు, గతంలో 60 వోవర్లు ఆడి 36 పరుగులు మాత్రమే చేసిన గవాస్కర్ గురించి ఏమ్మాట్లాడేవారో...

 

 

*సయ్యద్ సలీమ్ బాష, స్పోర్ట్స్  జర్నలిస్టు

loader