Asianet News TeluguAsianet News Telugu

మళ్లీ పేలిన ఐఫోన్ బ్యాటరీ

  • మరోసారి పేలిన ఐఫోన్ బ్యాటరీ
  • ఒకరికి గాయాలు
iPhone Battery Explodes At Zurich Apple Store One Injured

ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ మరోసారి పేలింది. స్విట్జర్లాండ్ లోని ఓ దుకాణంలో ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పేలిన ఫోన్ ఐఫోన్ 6గా గుర్తించారు.

 www.swissinfo.ch   అందించిన  ఒక నివేదిక ప్రకారం మంగళవారం ఈ పేలుడు చోటు చేసుకుంది. జ్యూరిచ్ లోని ఒక యాపిల్ దుకాణంలో ఐఫోన్‌ రిపేరు చేస్తుండగా  అకస్మాత్తుగా  బ్యాటరీ పేలుడు జరిగింది.  దీంతో రిపేరు చేస్తున్న  వ్యక్తి గాయపడగా,  మరో ఏడుగురు స్వల్పంగా గాయపడ్డారు.  అయితే ఈ పేలుడుకు కారణాలు ఇంకా తెలియలేదని ఆ నివేదిక పేర్కొంది. ఈ సంఘటనపై జ్యూరిచ్ ఫోరెన్సిక్ ఇన్స్టిట్యూట్‌ ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారని పోలీసు అధికారులు తెలిపారు. అయితే స్టోర్‌ సిబ్బంది తక్షణమే అప్రమత్తం కావడంతో  పెద్ద ప్రమాదం తప్పిందని ఒక ప్రకటనలో తెలిపారు మరోవైపు ఈ పేలుడుపై యాపిల్ ఇంకా స్పందించలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios