ఆ నోటు.. ఈ నోటు.. ఆర్ బి ఐ రూటే సపరేటు

indias 500 note and us dollar are same to same
Highlights

  • రూ. 500 నోటు ముద్రణ లో ఆర్ బీ ఐ కాపీ నైపుణ్యం

డాలర్ తో పాటు రూపాయి కూడా సమాన స్థాయిలో ఉండాలనేది సగటు భారతీయుడి కల. ఆ కల ఎప్పుడు నిజమౌతుందో లేదో తెలియదు. కానీ, ఆర్ బి ఐ మాత్రం తన ముద్రణా చాతుర్యంతో రూపాయి రూపాన్ని మార్చేసి తన డాలర్ డ్రీమ్స్ ను సఫలం చేసుకుంది.

 

పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్ బి ఐ ఎంతో శ్రమించి... ఎన్నో కష్టాలు పడి కొత్తగా రూ. 2000 నోటు, రూ. 500 నోటును తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

 

ఇక రూ. 2000 నోటు గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ నోటు ఇస్తే చాలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు వినియోగదారులు.

 

ఇక రూ. 500 నోటు విషయానికి వస్తే... అబ్బో ఇక్కడే ఆర్ బి ఐ సృజనాత్మకత టన్నులలో బయటపడింది.

 

అచ్చంగా డాలర్ స్థాయిలో తీసుకొచ్చారనేదానికంటే డాలర్ల ను కాపీ పేస్టు చేశారంటే బెటర్ గా ఉంటుంది. అంతాలా రూ. 500 నోటు ముద్రణలో ఆర్ బి ఐ తన కాపీ నైపుణ్యాన్ని ప్రదర్శించింది.

 

అమెరికా నోటును, మన 500 నోటును పక్కన పెట్టి చూస్తే తెలుస్తుంది ఆర్ బి ఐ పనితీరు ఎంత గొప్పగా ఉందనేది.

 

డాలర్ స్థాయికి రూపాయిని తీసుకరావడం అంటే ఇదేనేమో.

loader