డ్రాగా ముగిసిన మూడో టెస్టు

టీం ఇండియా వీరోచిత పోరాటానికి ఆ ఇద్దరు అడ్డుగోడలా నిలిచారు. గెలుస్తామనుకున్న మ్యాచ్ ను మన నుంచి లాగేసుకున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

భారత్, ఆస్ట్రేలియాల మధ్య రాంచీలో జరుగుతన్న మూడో టెస్టు ఇద్దరి పోరాటం వల్ల డ్రాగా ముగిసింది.

భారత్ గెలుపు ఖాయమనుకున్న దశలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ పీట‌ర్ హ్యాండ్స్‌కాంబ్‌, షాన్ మార్ష్ వీరోచితంగా పోరాడారు.

స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై భార‌త బౌల‌ర్ల‌ను దీటుగా ఎదుర్కొన్నారు.

63 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయి ఓటమి అంచుకుచేరుకున్న ఆసీస్ కు హ్యాండ్స్ కాంబ్ (72), మార్ష్ (53) అండగా నిలబడ్డారు.

ఆట ముగిసే సమయానికి ఆసీస్ 6 వికెట్లకు 204 రన్స్ చేసింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్ 1-1తో సమ మైంది.