యోగా వెనక ఎంత వ్యవహారముందో చూడండి

India exported yoga to US gets nothing in return
Highlights

యోగా లేకపోతే బతుకు గాడితప్పుతుందనే భయం అమెరికాను పట్టి పీడిస్తున్నది

భారత్ అమెరికాను ఇలా జయించింది...

అమెరికాలో యోగా భారీ వ్యాపారమయి కూర్చుంది. ఎక్కడ చూసినా యోగా నేర్పే స్టూడియోలు పుట్టుకొస్తున్నాయి.  ప్రాక్టీస్ చేస్తున్న వారి సంఖ్య తొందర్లో 80 మిలియన్లకు చేరేలా ఉందంటున్నారు.వాళ్లందరికి చాపలు, డ్రెస్, ధ్యానానికి పూసలదండలు , పళ్లరసాలు వగైరా సరఫరా చేసేందుకు పెద్ద ఇండస్ట్రీ తయారుయింది.  అమెరికన్లకు జీవితంలో  ఇపుడు అత్యంత ముఖ్యమయినది యోగ. యోగా లేకపోతే బతుకు గాడితప్పుతుందనే భయం పట్టుకుంది. అక్కడ యోగాభ్యాసం చేయడం అంతసులభం  కాదు. చాలా ఖరీదయిన వ్యవహారం. అయినాసరే, యోగా అమెరికాను కుదిపేస్తూ ఉంది.  ఇంతగా అమెరికాను గుప్పిట్లో పెట్టుకున్న మరొక విదేశీ సంప్రదాయం లేదేమో. ఇంత భారీగా భారత్ యోగాను అమెరికాకు ఎగుమతి చేసింది గాని,రాబడి నిల్.

 

*2016లో యోగా నేర్చకుంటున్న వారి సంఖ్య  36.7 మిలియన్లని యోగా జర్నల్ జరిపిన ఒక సర్వేలో వెల్లడయింది.అంటే ప్రతి10 మంది అమెరికన్లలో ఒకరు యోగాభ్యాసం చేస్తున్నారు

*2012లో  యోగాభ్యాసంలో ఉన్న వారు కేవలం  20.4 మిలియన్లే. .

* యోగాభ్యాసం చేస్తున్నవారిటలో 28 శాతం(10.3 మిలియన్లు) మంది మగవాళ్లయితే, 72 ( 26.4 మిటియన్లు) శాతం మహిళలు

*వారిలో  74 శాతం అయిదేళ్లగా యోగాభ్యాసం చేసున్నవారే.

*తొందర్లో తాము కూడా యోగాభ్యాసం మొదలుపెడతామని సర్వేలో పాల్గొన్న 34 శాతం మంది చెప్పారు.

*అమెరికాలో యోగా గురించి తెలిసిన వారి సంఖ్య 90 శాతం. మూడేళ్ల కిందట  ఇలాంటి వారి సంఖ్య కేవలం 75 శాతమే.

*యోగా  జీవితానికి మంచిదని, మనిషిని సౌమ్యంగా, దృఢంగానూ ఉంచుతుందని,క్రీడాసామర్థ్యం పెంచుతుందని, అలసట తీరుస్తుందని అమెరికన్ల విశ్వాసం.

*2016లో యోగా సామగ్రి, అంటే యోగా డ్రెస్,చాప,పూసలు, కొన్ని రకాల రసాలు, ఇతర పరికాలమీద అమెరికా యోగులు 16.8 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారు.

*అమెరికన్లు యోగా గురువులకు దక్షిణగా యేటా 5.8 బిలియన్ డాలర్లను చెల్లిస్తున్నారు. యోగా దుస్తుల మీద మరొక 4.6 బిలియన్ డాలర్లు ఖర్చు పెడుతున్నారు.

*యోగా చాపల మీద ఇతర వస్తువుల మీద మరొక 3.6 బిలియన్లు వెచ్చిస్తున్నారు.

యోగాభ్యాసం చేస్తున్న వారిలో 37 శాతం మంది 18 సంవత్సరాల లోపు పిల్లలే.

యోగా బిజినెస్ బిలియన్ డాలర్ వ్యవహారం కావడంతో అమెరికాలో ఎక్కడ చూసినా యోగా  స్టూడియోలు పుట్టుకొస్తున్నాయి. యోగా స్టూడియో చెయిన్లు  తయారవుతున్నాయి. కోర్ పవర్ యోగా అనే కంపెనీకి 100 నగరాలలో 165 స్టూడియోలున్నాయి.

  మిగతా వ్యవహారాలలో ఎలా ఉన్నా యోగా విషయంలో మాత్రం భారత్ అమెరికాను జయించేసింది.

loader