బాపు "బొమ్మలు"రమణ"కోతికొమ్మలు"రెండు మనకిక లేవు...

ఒక రోజు...

"నాకు డబ్బులు కావాలి." మిత్రుడికి ఫోన్ చెేశాడు ఒక పెద్దమనిషి.

"ఎప్పుడు కావాలి? మిత్రుడు అడిగాడు.

"మొన్నటికి!" అని పెద్దమనిషి జవాబు!!

(మూడేళ్ళయ్యింది.. బాపు గారు వెళ్ళిపోయి..(మొన్న31.08.14 నాటికి) అందుకే ఇప్పుడు రాస్తున్నా!

రమణ గారు అంతకు మూడేళ్ళ ముందే వెళ్ళిపోయారు.. (బాపు కన్న పెద్దావారు కద, వయసులో! సీనియారిటీ పాటించారు)

పైన అడిగిన పెద్దమనిషి "ముళ్ళపూడి", మిత్రుడు"బాపు"

ఒకాయన అప్పు అడిగి తీసుకోకుండానే వెళ్ళిపోతే, ఇంకో ఆయన ఇవ్వడానికి వెళ్ళాడు.

నిఖార్సైన కామెడికి "డ్రెస్సూ", "అడ్రెస్సూ" అయిన ఇద్దరు అలా వెళ్ళిపోవటం మనకు నచ్చకపోవచ్చు. అయినా వాళ్ళు అలానే చెస్తారు. అందుకే"బాపు-రమణలయ్యారు."

నాకు బాపు గీతలు, రమణ రాతలు రెండు తెగిష్టం. కుంచెతో బాపు, కలంతో రమణ అడుకున్నట్లు వేరెవరూ ఆడుకోలేదు,లేరు కూడాను.. తెలుగులోహాస్యంలో కాని, సినిమా రివ్యూల్లో కాని రమణ కు మించిన వారు లేరు. ఇక బాపు గురించి ఏం చెప్పగలం?

అచ్చ తెనుగుతో "అచ్చనకాయలు"(ఇప్పుడు లేవు లేండి)

ఆడుకున్న రమణ గారు "కోతి కొమ్మచ్చి" కూడా 

బాగనే ఆడారు.(మూడు పుస్తకాల్లో)

బాపు బొమ్మల గురించి చెప్పవసరంలేదు..(ఈ పదం ముళ్ళపూడి వారి పదమేననుకుంటా)

సెన్స్ ఆఫ్ హ్యూమరు రమణ రాతల్లో అలవోకగా ఉంటే

బాపు బొమ్మల్లో అందంగా ఉండేది..

"భార్య భర్తలు సమానమే కాని

భర్త కొంచెం ఎక్కువ సమానం!" అనటం

రమణ గారికే చెల్లింది.

రమణ గారి పదాల "కాయినేజ్" అనగా పదసృష్టి

వేరెవరికి సాధ్యం కాదన్నట్లుండేది..

"..అంత కంగారులోను "మందోబస్తు" చేసుకునాం కాని

మద్యాహ్నం "విందోబస్తు" చూసుకోలేదు..." అన్నది మచ్చుకు

ఒక్కటి.

రమణ గారి సినిమా రివ్యూల

గురించి ఎంత చెప్పినా తక్కువే

ఒక సినిమాకి రివ్యూ(బహుశా "తోడి కోడళ్ళు" అనుకుంటా)

రాస్తూ.."ఎందుకైనా, నినాదించేముందు కాస్త నిదానించి మరీ అందుకు

పూనుకోవడం వాంచనీయం" అని రాయగలిగే చమక్కు ఆయనకు

పెన్నుతో పెట్టిన విద్య!

మరో సినిమా "అక్కా చెళ్ళెల్లు " కు

రివ్యూ రాస్తూ.. " పడితే పడ్డవాళ్ళ పళ్ళు రాల్తాయ్. పొరబడితే పక్క వాళ్ళవీ

రాల్తాయ్. అయితే చెడ్డ వాళ్ళకి మత్రమే పై సదుపాయం జరుగుతుందని(పొర) పడ్డ 

వాళ్ళు నిక్షేపంలా ఉంటారని సినిమా నీతి.... కథలలో సుధలలాగా చెప్పుకోదగ్గ

డబ్బు, చెల్లే అధికారాలు ఉన్నవాళ్ళు పొరబాటున పొరబడిన ఎంత పెద్ద సినిమా కథలు సంభవిస్తాయో చెప్పలేము"

ఇది ఫక్తు ముళ్ళపూడి వరి చిక్కుమూళ్ళూ లేకుండా

చమత్కారంగా చెప్పగలిగే చమత్కారం!

బాపు గారి కార్టూన్ ల గురించి

చెప్పటం, కొండకచో మెచ్చుకోవటం

జగమెరిగిన బ్రాహ్మడికి జంధ్యం

వేసే ప్రయత్నం.. అందుకే ఆ పని(అంటే చెప్పటం)

చెయ్యటంలా

బాపు "బొమ్మలు"

రమణ"కోతికొమ్మలు"

రెండు మనకిక లేవు...

ఎక్కడొ కొంచెం దుఖ్ఖవూ,కొంచెం శూన్యవూను...

ఏ చేస్తాం? ఎప్పుడొ ఓసారి తప్పదు.

చివరగా నా జీవితంలో ఓ పెద్ద కాంప్లిమెంట్, అదీ ఓ పెద్దమనిషి నుంచి ఇది..!

"ముళ్ళపూడి గారి తర్వాత అంత చిలిపిగానూ,కామెడీగానూ,సెటైరికల్ గానూ తెలుగులో సినిమా రివ్యూలు రాయగలిగింది సలీం బాషాగారే! (అంటేనేనన్నమాట!)"

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడి క్లిక్ చేయండి

https://goo.gl/59V1We